ETV Bharat / state

Potato cultivation : ఆలుగడ్డల సాగుకు తెలంగాణ అనుకూలం - తెలంగాణ వ్యవసాయ వార్తలు

Potato cultivation : రాష్ట్రంలో ఆలుగడ్డ సాగును పెంచాలనే లక్ష్య సాధనలో తొలి అడుగు విజయవంతంగా పడింది. నాణ్యమైన విత్తనోత్పత్తి దిశగా ఉద్యానశాఖ చేసిన ప్రయోగం ఫలించింది. ఇతర రాష్ట్రాల వ్యాపారుల నుంచి నాసిరకం విత్తనాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.

Potato Cultivation
Potato Cultivation
author img

By

Published : Feb 20, 2022, 8:49 AM IST

Potato cultivation : రాష్ట్ర ఉద్యానశాఖ వినతి మేరకు తెలంగాణలో ఆలుగడ్డ సాగుకున్న అనుకూలతలపై సిమ్లాలోని కేంద్ర ఆలుగడ్డల పరిశోధనా సంస్థ (సీపీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. ఇక్కడి అనుకూల వాతావరణం ఉందని, ఇతర రాష్ట్రాల్లో ఆలుపైరుకు వచ్చే లేట్‌బ్లైట్‌, బ్యాక్టీరియల్‌ తెగులు కూడా తెలంగాణలో కన్పించలేదని గుర్తించారు. తొలుత ఇక్కడి రైతులకు అవసరమైన మేరకు ఆలు విత్తనోత్పత్తిని పెంచాలని సూచించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన వర్సిటీ పక్కనున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీఓఈ) కేంద్రంలో ఆలు విత్తన పంటను ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ‘కుఫ్రీ ఫుక్రాజ్‌, కుఫ్రీ హిమాలిని, గంగా, కుఫ్రీ మోహన్‌, సూర్య అనే ఐదు రకాల విత్తనాలను విజయవంతంగా సాగుచేసింది.

కొరత ఉంది.. సాగైతే కాసులు పండిస్తుంది

తెలంగాణలో ఆలుగడ్డ తలసరి వినియోగం సంవత్సరానికి 6.24 కిలోలుగా ఉంది. రాష్ట్ర అవసరాలకు ఏటా 2.04 లక్షల టన్నుల ఆలుగడ్డలు అవసరంకాగా, వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి కొనుగోలుకు వినియోగదారులు ఏటా రూ.403 కోట్లు వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,906 ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగవుతుండగా, 47,169 టన్నుల దిగుబడి వస్తోంది. అవసరమైనంత పంట ఇక్కడే పండితే ఈ సొమ్మంతా ఇక్కడి రైతులు, వ్యాపారులకే వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ విశ్లేషించింది.

సీపీఆర్‌ఐ సిఫార్సులు ఇవీ

* రాష్ట్రంలో ఆలు పంట ఉత్పత్తి కొరత లక్షా 56 వేల టన్నులుగా ఉంది. మరో 21 వేల ఎకరాల్లో సాగుచేసే వీలుంది.

* ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, తెలంగాణలో ఆలుగడ్డ సాగవుతోంది. వీటిలో బిహార్‌, మధ్యప్రదేశ్‌లో మాత్రమే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పంట కోతకు వస్తోంది. మిగతా రాష్ట్రాల్లో అంతకుముందే వస్తుంది. తెలంగాణలో కూడా ఫిబ్రవరిలో కోతకువచ్చే అనుకూలత ఉన్నందున ఇక్కడ సాగు పెరిగితే దక్షిణాదిరాష్ట్రాల మార్కెట్లలోఅమ్మడానికి అవకాశాలుంటాయి.

ఎఫ్‌పీఓలతో రైతులకు లాభం

ఇతర రాష్ట్రాల వ్యాపారులు సాధారణ పంటనే శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి విత్తనాలుగా తెలంగాణ రైతులకు అమ్ముతున్నారు. అందువల్ల మొలకరాకపోవడం, వచ్చినా గడ్డ పెరగక పోవడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు’(ఎఫ్‌పీఓ) ఏర్పాటుచేసుకుని ఆలు విత్తన, సాధారణ పంటలు పండిస్తే దేశమంతా అమ్ముకుని లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది. రైతులు ముందుకొస్తే సాగుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం. - ఎల్‌.వెంకట్రాంరెడ్డి, ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు

ఇదీ చూడండి : Dalit Bandhu: ఇష్టానుసారంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.