Telangana Intellectuals Letter To PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన రాష్ట్రానికి వస్తున్న తరుణంలో పలువురు ప్రొఫెసర్లు, రచయితలు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ బుద్ధిజీవుల తరఫున బహిరంగ లేఖాస్త్రం సంధించారు. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం తరపున కొన్ని అంశాలను లేఖలో గుర్తు చేశారు. ఎనిమిది డిమాండ్లను లేఖ ద్వారా ప్రధాని మోదీ ముందు ఉంచారు.
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ పునరుద్ధరించాలి లేదా సమాన ప్యాకేజీ ఇవ్వాలని తెలిపారు. తెలంగాణకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి వైద్యకళాశాలలు, విద్యాసంస్థలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కక్ష, వివక్ష, పక్షపాత ధోరణి విడనాడాలని పేర్కొన్నారు. మతతత్వ ధోరణి విడనాడి దేశఐక్యత, బహుళతత్వాన్ని కాపాడేలా పాలన కొనసాగించాలని తెలిపారు. దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీకి వారు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్లైన్!