ETV Bharat / state

రాష్ట్రానికి 8300 క్వింటాళ్ల ఉల్లి దిగుమతి

కూరగాయల ధరలు అందుబాటులోకి తేవడంపై మార్కెటింగ్ శాఖ చర్యలు ప్రారంభించింది. జంట నగరాల్లో కూరగాయల ధరలు నియంత్రణలోకి వచ్చాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను అభినందించారు.

telangana imports 8300 quintals of onions from maharashtra
రాష్ట్రానికి 8300 క్వింటాళ్ల ఉల్లి దిగుమతి
author img

By

Published : Mar 29, 2020, 5:48 AM IST

కూరగాయల ధరలు జంట నగరాల్లో నియంత్రణలోకి వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. అవసరాలకు సరిపడా ఉల్లిగడ్డ, బంగాళాదుంప నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. 8300 క్వింటాళ్ల ఉల్లి మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిందన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి సరిపడినన్ని ఆలుగడ్డలు దిగుమతి అయ్యాయని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా విషయంలో పలు రకాల ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 331 ప్రాంతాల్లో 177 మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసరాల కొరత ఉత్పన్నం కావద్దని అన్నారు. కూరగాయల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయల రవాణాకు ఆయా మార్కెట్ల అధికారుల నుంచి వాహనాలకు అనుమతి పత్రాలు పొందవచ్చని అన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా మార్కెట్లు, రైతుబజార్లలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ఇదీ చూడండి : బియ్యం, నగదు త్వరలోనే పంపిణి చేస్తాం: సీఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.