ETV Bharat / state

Telangana ICET Counselling 2023 New Schedule : ఐసెట్​ కౌన్సెలింగ్ షెడ్యూల్​లో మార్పు.. కొత్త తేదీలు ఇవే!

author img

By

Published : Aug 12, 2023, 4:13 PM IST

Telangana ICET Counselling 2023 New Schedule : ఆగస్టు 14న జరగాల్సిన ఐసెట్​ కౌన్సెలింగ్ వాయిదా వేసి.. సెప్టెంబర్​ 6 నుంచి జరుగుతుందని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. సీటు వచ్చిన విద్యార్థులు సెప్టెంబరు 29, 30 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో చేరాలని కన్వీనర్ తెలిపారు. సెప్టెంబరు 29న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

TS ICET Counselling New Schedule
Telangana ICET Counselling Dates 2023

Telangana ICET Counselling 2023 New Schedule : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఐసెట్​ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి మార్పులు చేసింది. ఆగస్టు 14న జరగాల్సిన కౌన్సెలింగ్​ వాయిదా వేసి.. సెప్టెంబర్ 6కు మార్పు చేసింది. దీంతో కొత్త షెడ్యూల్​ను కూడా విద్యా శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. 8 నుంచి 12వ తేదీల వరకు ఐసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనుంది. సెప్టెంబరు 8 నుంచి 13వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మొదలవుతుంది.

Telangana ICET Counselling New Schedule : సెప్టెంబర్ 17న ఎంబీఏ, ఎంసీఏ తొలివిడత సీట్ల కేటాయింపు చేయనుంది. 22 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ జరగునుంది. 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్లు కేటాయిస్తారు. సీటు వచ్చిన విద్యార్థులు 29, 30 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో చేరాలని కన్వీనర్ తెలిపారు. 29న స్పాట్ అడ్మిషన్ల( MBA, MCA Spot Admissions) మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకతీయ వర్సిటీ వెల్లడించింది. మరోవైపు కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు గడువు నేటితో ముగియాల్సి ఉండగా.. దాన్ని ఆదివారం వరకు పొడిగించినట్లు కన్వీనర్ తెలిపారు.

కొత్త షెడ్యూల్​ :

అంశం తేదీలు
ఐసెట్ కౌన్సెలింగ్సెప్టెంబర్ 6

ధ్రువపత్రాల పరిశీలనకు

స్లాట్​ బుకింగ్​

సెప్టెంబర్ 6 నుంచి 11 వరకు
ధ్రువపత్రాల పరిశీలనసెప్టెంబర్ 8 నుంచి 12 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదుసెప్టెంబర్ 8 నుంచి 13వరకు
తొలివిడత సీట్ల కేటాయింపుసెప్టెంబర్ 17
తుది విడత కౌన్సెలింగ్సెప్టెంబర్ 22
తుదివిడత సీట్లు కేటాయింపుసెప్టెంబర్ 28
స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు సెప్టెంబర్ 29

Telangana ICET 2023 Results : ఐసెట్‌లో మెరిసిన అబ్బాయిలు.. మొదటి పది ర్యాంకులు కైవసం

Telangana ICET 2023 Details : 2023 ఫిబ్రవరి 28న ఐసెట్​ నోటిఫికేషన్​ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2023- 24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ వృత్తి విద్యా కోర్సులకి దరఖాస్తులు పెట్టుకోవాలని ప్రకటన జారీ చేసింది. ఆన్​లైన్​ ద్వారా మార్చి 06 నుంచి మే 06 వరకు గడవు ఇచ్చింది. అదనపు ఫీజుతో మే 18 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. అనంతరం మే 26, 27 తేదీల్లో ఐసెట్​ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. 70,900 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. జూన్​ 29న ఈ పరీక్ష ఫలితాల(TS ICET 2023 Results)ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 86.17 శాతం ఉత్తీర్ణత అవ్వగా.. 61,092 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు. ఇందులో తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలే ఉన్నారు. తొలి ర్యాంక్​ నూకర్​ శరణ్​కుమార్​ సాధించాడు.

TS EAMCET 2023 addmission counselling schedule : వృత్తి విద్యాకోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

Entrance Examination Schedule: వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ విడుదల..

TS ICET 2022 : ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.