తెలంగాణలో కొబ్బరిసాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం కొబ్బరి పంట కేవలం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకే పరిమితమైందని... దీనిని మరిన్ని జిల్లాలకు విస్తరించడానిని అవసరమైన ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు వివరించారు. కొచ్చిలోని కొబ్బరి అభివృద్ధి సంస్థ చేపట్టిన పథకాల ప్రకారం రైతులకు సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,141 ఎకరాలలో 68,46,000 కొబ్బరి కాయల ఉత్పత్తి జరుగుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో సాగు నీటి సదుపాయాలు పెరగటం వల్ల ఈ పంట సాగు పెంచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని... పెద్దపల్లి, ములుగు,భూపాల్‌పల్లి జిల్లాల్లో అనుకూల పరిస్థితులున్నట్లు పేర్కొంది. కొబ్బరి సాగు ద్వారా రైతులకు ఎకరానికి 80,000 నికర ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. తెలంగాణకు అనువైన రకాలను కేరళలోని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీచర్చ్ ఇనిస్టిట్యూట్ సూచించినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్