ETV Bharat / state

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు.. హైకోర్టులో మరోసారి విచారణ - దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసు

TS HC on Disha Accused Encounter case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను త్వరగా అమలు చేయాలని ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి కుటుంబసభ్యుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది వృందా గోవత్‌ కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

TS HC on Disha Accused Encounter case
TS HC on Disha Accused Encounter case
author img

By

Published : Jan 2, 2023, 2:48 PM IST

Updated : Jan 2, 2023, 5:15 PM IST

TS HC on Disha Accused Encounter case : దిశ అత్యాచార, హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌ పట్ల సిర్పూర్కర్ కమిషన్‌ అందజేసిన నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరఫున ప్రముఖ న్యాయవాది వృందా గోవత్‌ వాదనలు వినిపించారు. బాధితుల తరఫున వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. అదే రోజున ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.

ఈ కేసులో సిర్పూర్కర్ కమిషన్‌ ఇచ్చిన నివేదికను వెంటనే అమలు చేయాలని ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి కుటుంబసభ్యుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది వృందా గోవత్‌ కోరారు. కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా 10మంది పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. ఈ ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతుందని... బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Last Updated : Jan 2, 2023, 5:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.