ETV Bharat / state

Dharani Portal Issues : 'ధరణి సమస్యలు త్వరగా పరిష్కరించండి'.. హైకోర్టు ఆదేశాలు - ధరణిలో సమస్యల పరిష్కారానికి 4 వారాలు సమయం

Dharani Portal Issues : భూముల్లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడం సహా భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షిత, ఇబ్బందిలేని సేవలందించే లక్ష్యంతో తెచ్చిన.. ధరణిలో సమస్యలు తొలగలేదు. సమస్యల పరిష్కారం కోసం.. ప్రభుత్వం ఎన్నిమార్పులు చేసినా ఓ పట్టాన కొలిక్కిరావట్లేదు. సమస్యలు పరిష్కరించాలంటూ కోర్టుల్లో.. పలువురు కేసులు దాఖలు చేస్తున్నారు.

Dharani
Dharani
author img

By

Published : May 5, 2023, 8:47 AM IST

ధరణి పోర్టల్​లో ప్రధానంగా 20 సమస్యలు ఉన్నాయి: హైకోర్టు

Dharani Portal Issues : రెవెన్యూ శాఖలో భూమి హక్కులు, రికార్డులకు చెందిన సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన ధరణిలో మరిన్ని సమస్యలు ఎదురవు తున్నాయని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానానికి వస్తున్న పిటిషన్ల ఆధారంగా పరిశీలిస్తే దాదాపు 20 వరకు సమస్యలు ప్రధానంగా ఉన్నట్లు పేర్కొంది. ఆ సమస్యలపై కలెక్టర్ ద్వారా గ్రామ, మండల, రెవెన్యూ అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అందుకు నాలుగు వారాల గడువును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీసీఎల్​ఏకు హైకోర్టు ఇచ్చింది.

Telangana HC on Dharani Portal Issues : రెవెన్యూశాఖలో రిజిస్టర్‌ సేల్‌ డీడ్‌తో పాటు.. ఇతరత్రా సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకపోవడం, ఇతర ధరణి సమస్యల పరిష్కారంలో జాప్యంపై దాఖలైన.. పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. నిర్ధిష్ట గడువులోగా ఈ-పట్టాదారు పాస్‌బుక్‌లో.. సవరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించకపోవడం, సర్వే, నిమిత్తం.. F-లైన్ దరఖాస్తులను స్వీకరించడం లేదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన ఆస్తులకు విక్రయ దస్తావేజులు జారీ చేయడంలేదు. ధరణి పోర్టల్‌లో జీపీఏని రిజిస్ట్రేషన్ సమయంలో పట్టించుకోకపోవడం లేదన్నారు. ఏ కారణం చెప్పకుండా F-లైన్ దరఖాస్తులు సహా.. సరైన పద్ధతిలో సమర్పించలేదంటూ దరఖాస్తులను తిరస్కరించడం.. కోర్టు, డిక్రీలో టైటిల్ మార్పుపై స్పష్టత లేనప్పుడు.. ఇతర విధానాల్లో దరఖాస్తులు వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీళ్లకు, రివిజన్ నిమిత్తం నిబంధనలు లేవన్నారు.

ధరణి పోర్టల్​లో అనేక సమస్యలు: నిర్ధిష్టమైన ఆస్తిపై స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులిస్తే మొత్తం సర్వే నంబర్‌ని నిషేధిత జాబితాలో ఉంచడం, న్యాయస్థానాల్లోని పెండింగ్ కేసులను.. ప్రత్యేక ట్రైబ్యునల్‌కి పంపకపోవడంతో సమస్యలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఉమ్మడిగా కొనుగోలు చేసిన ఆస్తులను విభజన చేసుకునేందుకు అవకాశం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. యజమాని మృతి చెందాక వారసులు పట్టా పొందేందుకు అవకాశం లేకపోవడం, గల్లంతైన సర్వే నంబర్ తప్పుడు పద్దులు.. ప్రభుత్వం సేకరించిన భూ వివరాలు తొలగించడం వంటి సమస్యలు ధరణిలో ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.

తదుపరి విచారణ జూన్​ 15కు వాయిదా: వాటన్నింటితో పాటు గ్రామ, మండల స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అభిప్రాయాలను.. కలెక్టర్ల ద్వారా సేకరించి నాలుగు వారాల్లో చట్టప్రకారం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అందుకు సంబంధించి అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలంటూ.. తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేశారు. పిటీషనర్లు తమ అభ్యర్థనలను మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.