ETV Bharat / state

'రూ. 2.5 కోట్ల భూమిని రూ.5 లక్షలకు దర్శకుడు శంకర్​కు ఎలా కేటాయించారు'

tg high court hearing on n. shankar  land issue
శంకర్​పల్లిలో దర్శకుడు శంకర్​కు భూకేటాయింపుపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Aug 10, 2020, 2:05 PM IST

Updated : Aug 10, 2020, 10:15 PM IST

13:37 August 10

దర్శకుడు శంకర్​కు భూకేటాయింపుపై హైకోర్టులో విచారణ

దర్శకుడు ఎన్.శంకర్‌కు హైదరాబాద్​ శంకర్​పల్లిలో ఐదెకరాల భూమి కేటాయించడంపై హైకోర్టు విచారణ చేపట్టింది.  ఎకరం రూ. 5 లక్షల చొప్పున ఆ స్థలంలో రూ. 50 కోట్ల వ్యయంతో స్టూడియో నిర్మించనున్నట్లు దర్శకుడు శంకర్​ వివరించారు. దాని ద్వారా దాదాపు 300 మందికి ఉపాధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.  

ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ఎకరం రూ. 2.5 కోట్లు ఉంటుందని హెచ్​ఎండీఏ పేర్కొంది. రూ. రెండున్నర కోట్లున్న భూమిని రూ. ఐదు లక్షలకే ఎలా కేటాయించారంటూ హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్​ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలన్న న్యాయస్థానం.. భూకేటాయింపులు నిర్దిష్ట పద్ధతిలో జరగాలని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు తెలిపింది.  అడ్వకేట్ జనరల్ క్వారంటైన్‌లో ఉన్నందున ప్రభుత్వ న్యాయవాది గడువు కోరగా తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

Last Updated : Aug 10, 2020, 10:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.