HC on Double Bed Room Houses: రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు తదితరులకు రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ.. శివప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది.
రెండు పడక గదుల ఇళ్లను ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని వర్గాలకు కేటాయించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొన్నందున.. హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇళ్లను ఎవరికి కేటాయించారనే విషయంపై విచారణ చేపట్టలేమని స్పష్టం చేస్తూ.. పిటిషన్‌ను కొట్టేసింది.
ఇదీ చూడండి: ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌కి ఒక్క నిమిషం ముందు వీడియో