ETV Bharat / state

శ్రీనివాస గాంధీకి హైకోర్టులో ఊరట.. అరెస్ట్​ చేయొద్దని ఆదేశం - శ్రీనివాస గాంధీ అవినీతి కేసు తాజా వార్తలు

ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్​ శ్రీనివాస గాంధీకి ఉన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. తనపై నమోదైన సీబీఐ కేసును సవాలు చేస్తూ.. గాంధీ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. వాదన, ప్రతివాదనల తర్వాత నవంబరు 4 వరకు గాంధీని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్​ 2కి వాయిదా వేసింది.

శ్రీనివాస గాంధీకి హైకోర్టులో ఊరట.. అరెస్ట్​ చేయొద్దని ఆదేశం

author img

By

Published : Oct 20, 2020, 8:32 AM IST

ఈడీ మాజీ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్ శ్రీనివాస గాంధీకి హైకోర్టులో ఊరట లభించింది. నవంబరు 4 వరకు గాంధీని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, విజిలెన్స్ డైరెక్టర్లను ఆదేశిస్తూ విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.

తనపై నమోదైన సీబీఐ కేసును సవాలు చేస్తూ.. గాంధీ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. దర్యాప్తునకు జీఎస్టీ కమిషనర్ ఆదేశించవచ్చు కానీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఆ అధికారం లేదని గాంధీ తరఫు న్యాయవాది వాదించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆధారాలుంటే సీబీఐ ఇప్పటి దాకా ఎందుకు అభియోగ పత్రం దాఖలు చేయలేదన్నారు. ఏపీ సీఎం జగన్ కేసులో భాగంగా ఇందూ ప్రాజెక్ట్ నుంచి రూ.29 లక్షల 69 వేలు శ్రీష అసోసియేట్స్ పేరుతో వసూలు చేశారన్న ఆరోపణలు అవాస్తవమని వాదించారు.

ఇన్ఫెనిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ గ్రూపు ఇన్​పుట్ టాక్స్ క్రెడిట్ వ్యవహారంలో శ్రీనివాస గాంధీ రూ.5 కోట్లు డిమాండ్ చేశారని.. రూ.10 లక్షలు తీసుకున్నారన్నారని సీబీఐ న్యాయవాది సురేంద్ర వాదించారు. ముడుపులకు సంబంధించిన దర్యాప్తునకు ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నారు. కమిషనర్ స్థాయికంటే ఎక్కువ హోదాలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతిస్తే తప్పేలా అవుతుందని వాదించారు. కౌంటరు దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గడువు కోరడం వల్ల విచారణను నవంబరు 2కి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే 4 వరకు గాంధీని అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: బాలినేని శ్రీనివాస్ గాంధీ అవినీతిలో కొత్త కోణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.