ETV Bharat / state

తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సచివాలయం కూల్చొద్దు: హైకోర్టు

తుది నిర్ణయం తీసుకోకుండానే సచివాలయ భవనాల కూల్చివేతపై తొందర ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణ డిజైన్‌ లేకుండానే కొత్త సచివాలయం నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. సచివాలయం కూల్చివేతలపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భవనాలు కూల్చవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

telangana high court
telangana secretariat
author img

By

Published : Feb 12, 2020, 9:35 PM IST

తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సచివాలయం కూల్చొద్దు: హైకోర్టు

నూతన సచివాలయం నిర్మాణానికి బ్రేక్ పడింది. సచివాలయంలోని ప్రస్తుత భవనాల జోలికి వెళ్లొద్దని సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ సచివాలయ నిర్మాణాలను కూల్చొద్దని ఆదేశించింది. నూతన సచివాలయ నిర్మాణం కోసం ప్రస్తుత భవనాలను కూల్చవద్దని కోరుతూ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం వద్ద ఇవాళ మరోసారి విచారణ జరిగింది.

కనీసం డిజైన్లు కూడా ఇవ్వలేదు

ఎంత విస్తీర్ణంలో సచివాలయం నిర్మిస్తారు.. ఒక్కో శాఖకు ఎంత స్థలం కేటాయిస్తారు.. ఎంత ఖర్చవుతుంది.. ఎప్పట్లోగా పూర్తవుతుంది.. అప్పటి వరకు వివిధ శాఖలు ఎక్కడి నుంచి పనిచేస్తాయనే పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు గతంలో ఆదేశించింది. పలు అంశాలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము అడిగిన పూర్తి వివరాలు లేవని.. కనీసం డిజైన్లు కూడా సమర్పించలేదని పేర్కొంది.

ఇన్ని రోజులా..

కొత్త సచివాలయానికి డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వివరించారు. కృత్తిమ మేధ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న రోజుల్లో భవన నిర్మాణ డిజైన్లు రూపొందించడానికి చాలా రోజులు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. డిజైన్లు, విస్తీర్ణం వివరాలు లేకుండా సచివాలయం నిర్మాణానికి కేబినెట్ తీర్మానం చేయడం ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్మాణానికి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని... ఈ దశలో పిటిషన్లను ప్రోత్సహించరాదని అదనపు ఏజీ పేర్కొన్నారు.

ఎందుకంత తొందర

తుది నిర్ణయం తీసుకోకుండానే భవనాల కూల్చివేతలకు తొందర ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. తుది నిర్ణయం తీసుకోకుండానే కొత్త సచివాలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారా... పాత భవనాల కూల్చివేతకు బుల్ డోజర్లు తరలించారా అని అడిగింది. పూర్తి వివరాలతో కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే వ్యాజ్యాలపై విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రస్తుత భవనాలను కూల్చొద్దని సర్కారును ఆదేశించింది.

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయంపై హైకోర్టు ఆశ్చర్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.