ETV Bharat / state

స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటన.. సుమోటోగా పిల్‌ స్వీకరించిన హైకోర్టు

author img

By

Published : Mar 30, 2023, 9:15 AM IST

Secunderabad Swapna lok fire accident Updates : సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ అగ్నిప్రమాద ఘటనను హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్పందించింది. మరోవైపు ఈ ఘటనతో తెరపైకి వచ్చిన క్యూనెట్ సంస్థ అక్రమాలపై ఈడీ కొరఢా ఝుళిపిస్తోంది. నిధుల మళ్లింపు అభియోగంపై నమోదైన కేసులో సంస్థకు చెందిన రూ.137 కోట్లను ఫ్రీజ్‌ చేసింది.

High Court accepted Swapnalok fire accident as sumoto pill

Secunderabad Swapna lok fire accident Updates : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ నెల 16న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. సీఎస్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీ, హైదరాబాద్ కలెక్టర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది.

ఈ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. స్వప్నలోక్ కాంప్లెక్స్​లో కార్యకలాపాలు సాగిస్తున్న క్యూనెట్ సంస్థ అక్రమాలు తెరపైకి వచ్చాయి. అధిక కమీషన్లు ఆశజూపి అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకుని గొలుసు కట్టు వ్యాపారం చేస్తున్న క్యూనెట్ సంస్థ అక్రమాలు ఇప్పటికే బట్టబయలైన విషయం తెలిసిందే. తాజా అగ్నిప్రమాద ఘటనతో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూల్ చేస్తున్నట్లు పలువురు బాధితులు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఈ సంస్థకు చెందిన రూ.137 కోట్లను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

HC accepted Swapnalok fire accident as sumoto pill: విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న క్యూనెట్‌ సంస్థ.. అత్యధిక కమీషన్లు ఇస్తామని ఆశ చూపి అమాయకులతో పెట్టుబడులు పెట్టించి, వారి ద్వారా పలు వస్తువులు కొనిపించి నిషేధిత గొలుసు కట్టు వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థ అక్రమ కార్యకలాపాలపై ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 38 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇటీవల సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో క్యూనెట్ సంస్థకు చెందిన కార్యాలయం దగ్ధమైంది. ఘటనలో మృతి చెందిన ఆరుగురూ ఆ సంస్థలో పని చేసే వారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో క్యూనెట్‌ అక్రమాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

ఈ క్రమంలోనే క్యూనెట్‌ అక్రమాలపై గతంలో సైబరాబాద్‌ ఠాణాలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. నిధుల మళ్లింపు అభియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 24న బెంగళూరులో 4, రాష్ట్రంలో 3 చోట్ల సోదాలు నిర్వహించారు. సంస్థతో పాటు దాంతో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన రూ.137 కోట్లను స్తంభింపజేశారు. ఈ విషయాన్ని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించిన ఈడీ.. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.