ETV Bharat / state

బాలింతల మృతిపై దర్యాప్తునకు కమిటీ.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం - మలక్‌పేట్‌ బాలింతల మృతి కేసు అప్డేట్

Malakpet Women death case : హైదరాబాద్ మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై వైద్యశాఖ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు కమిటీ వేసి విచారణ జరిపిస్తామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు బాలింతల మృతిపై స్పందించిన ఆర్డీవో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Malakpet Women death case
Malakpet Women death case
author img

By

Published : Jan 13, 2023, 3:57 PM IST

Malakpet Women death case : హైదరాబాద్‌ మలక్‌పేట్ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలింతల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆర్డీవో తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై వైద్యశాఖ కమిషనర్ స్పందించారు. బాలింతల మృతిపై దర్యాప్తునకు కమిటీ వేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Malakpet Women death case update : మలక్‌పేట్ ఆసుపత్రిలో బాలింతలు మృతి చెందడం పట్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బాలింతలు మరణించడం దారుణం అన్నారు. వీరి మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. గతంలో ఇబ్రహీంపట్నంలో నలుగురు చనిపోయారని గుర్తు చేశారు. నాలుగు నెలల్లోనే మళ్లీ అలాంటి ఘటన జరిగిందని విమర్శించారు. హైదరాబాద్‌లోనే ఇలా ఉంటే పల్లెల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బాధ్యత వహించి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.

అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ మలక్‌ పేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం కలకలం రేపింది. నాకర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండి మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల, సైదాబాద్‌కు చెందిన శివానిలను ప్రసవం కోసం మలక్‌ పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యం అందించడంలో జాప్యం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతలు చనిపోయారని బంధువులు,కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఇద్దరు బాలింతల మృతితో బాధిత కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు బాలింతలు మృతి చెందినా కనీసం వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. పేదలైనందునే చిన్నచూపు చూస్తున్నారని నిరసించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింతలు చనిపోయారని చాదర్‌ఘాట్‌ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై డీసీహెచ్‌ఎస్‌ సునీత స్పందించారు. బాలింతల మృతిలో వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ఆమె చెప్పారు. చికిత్సలో ఎలాంటి లోపం లేదన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ కోసం ఒక టీమ్‌ని కమిషనర్‌ నియమించినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.