Telangana Haritha Utsavam today news : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు. డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ కూడా హరితహారంలో పాల్గొన్నారు. దాదాపు 57 కోట్ల మెుక్కలు నాటి దేశంలోనే మెుదటిస్థానంలో తెలంగాణ నిలిచిందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
MP Santosh at Haritha Haram Program in Uppal : మరోవైపు హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లే అవుట్లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ,ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించడం జరిగిందని సంతోశ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి.. వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Harish Rao on Haritha Haram : ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హరితహారాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గ్రీన్ కవర్‌లో 7.7 శాతంతో అద్భుతమైన వృద్ధిని చూశామని.. ఇది సీఎం కేసీఆర్ గారి దూరదృష్టి వల్లే సాధ్యమైందని కొనియాడారు.
- Harish Rao on Telangana Green Cover : 'కేసీఆర్ దూరదృష్టితోనే.. తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7% వృద్ధి'
- Telangana Harithosthavam Today : నేడు 'తెలంగాణ హరితోత్సవం'.. మొక్కలు నాటనున్న సీఎం
Talasani Planted Saplings at Nehru Park : హైదరాబాద్ మారేడుపల్లిలోని నెహ్రూ పార్కులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. అనంతరం పద్మారావు నగర్‌లోని చిదానందం కాలనీలో నూతనంగా నిర్మించిన తెలంగాణ దశాబ్ది పార్కును, వెంకట్ రావు నగర్ పార్క్‌లను ప్రారంభించారు. మొక్కలు నాటుతూ చెట్లను పెంచడం మూలంగా ఆరోగ్యకరమైన ఆక్సిజన్ ప్రజలకు లభిస్తుందని అన్నారు.
Gangula Kamalkar on Telangana Harith Utsavam : హరితహారోత్సవంలో భాగంగా ఒక్కరోజే కరీంనగర్ నగరంలో ఆరు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీతోపాటు పద్మా నగర్లో మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన మొక్కలు నాటారు. హరితహారంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడంలో నగరపాలక సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న కేబుల్ బ్రిడ్జి ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ ఆర్వి కర్ణన్‌తో కలిసి పరిశీలించారు.
Errabelli at Haritha Haram in Warangal : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెుక్కను నాటారు. హరితహారం కోసం అత్యధిక నిధులు ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అర్బన్ పార్కులో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవుల్లో తిరిగే వన్యప్రాణులు వివిధ రకాల అరుదైన మొక్కలు, గింజల ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం అటవీ శాఖ అధికారులను సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేశారు. దేశంలో 7 శాతం అడవులను పెంచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు.
ఇల్లందు నేచురల్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ మొక్కను నాటారు. ఇప్పటివరకు ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో 277 కోట్ల మొక్కలు నాటామని.. 14 వేల 864 నర్సరీలను అటవీ శాఖ, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తెలంగాణకు మణిహారంగా మారిన హరితహారం.. ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. భద్రాచలంలోని ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాలలోఆర్డీవో రత్న కల్యాణి మెుక్కలు నాటారు. సమాజానికి చెట్లు ఎంత అవసరమో విద్యార్థులకు వివరించారు.
ఇవీ చదవండి: