ETV Bharat / state

Gurukul Exam Telangana 2023 : గురుకుల పరీక్ష రాస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే - సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టులు

Telangana Gurukul Exam Tips 2023 : ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు సంక్షేమ గురుకులాల్లోని 9,210 పోస్టులకు సీబీటీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 17 జిల్లాల్లోని 104 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రతి తప్పుడు జవాబుకు పావు మార్కు పోతుంది. ఈ పరీక్షలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలు ఒకసారి చూద్దాం.

Gurukula Welfare Exam
Gurukula Welfare Exam
author img

By

Published : Jul 29, 2023, 9:19 AM IST

Telangana Gurukul Exam 2023 : రాష్ట్రంలో ఉన్న సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు(సీబీఆర్​టీ) నిర్వహించనున్నారు. ఈమేరకు గురుకుల నియామక బోర్డు కార్యనిర్వహణాధికారి మల్లయ్యబట్టు వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.

Telangana Gurukul Exam Tips 2023 : అభ్యర్థుల హాల్ టికెట్లును వెబ్​సైట్లో పొందుపరిచామని.. వ్యక్తిగత లాగిన్ ఐటీల ద్వారా డౌన్​లోడ్ చేసుకోవాలన్నారు. ఈ పోస్టులకు 2.26 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి నుంచి బయోమెట్రిక్, ఫొటో తీసుకుంటారని.. సూచించిన సమయంలోగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మల్లయ్యబట్టు తెలిపారు.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలు :

  • ఈ గురుకుల పరీక్ష 19 రోజుల పాటు రోజుకు మూడు షిప్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం షిప్ట్ 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టు 4.30 నుంచి 6.30 గంటల వరకు జరగనుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
  • పరీక్ష జరిగిన అన్ని రోజులు షిప్టుకు 15 నిమిషాల ముందుగానే గేట్లను మూసివేస్తారు. ఆ తర్వాత ఎవ్వరిని అనుమతించారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ముగిసే వరకు బయటకు వెళ్లడానికి అనుమతించరు.
  • అభ్యర్థులు హాల్ టికెట్​తో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకుని వెళ్లాలి. లేకపోతే పరీక్ష హాల్​లోకి అనుమతించరు. ఒకవేళ హాల్​టికెట్​పై ఫొటో ప్రింట్ లేకుంటే.. మూడు పాస్​పోర్ట్ సైజ్ ఫొటోలపై గెజిటెడ్ అధికారితో సంతకం.. అండర్​టేకింగ్ ధ్రువీకరణ పత్రం తీసుకుని ఇన్విజిలేటర్​కు అందించాలి. లేకపోతే లోపలకి రానివ్వరు.
  • పరీక్ష కేంద్రం ముందు తనిఖీలు ఉంటాయి. గుర్తింపు ధ్రువీకరించిన తర్వాతనే అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, కాగితాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లరాదు. కేవలం చెప్పులు మాత్రమే ధరించాలి.. బూట్లను ధరించి పరీక్ష గదిలోకి వెళ్లకూడదు.
  • గుర్తింపు కార్డు, హాల్​టికెట్, నామినల్ రోల్​లలో ఫొటోలు వేరుగా ఉన్నా.. అభ్యర్థి వ్యక్తిగత ధ్రువీకరణలో లోపాలు ఉన్నా.. వెంటనే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.
  • ఈ గురుకుల నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు అభ్యర్థులు హాల్ టికెట్లను భద్రపరుచుకోవాలి.
  • పరీక్ష పేపర్-1,2,3లో తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి పావు(0.25) మార్కు కోత విధిస్తారు. కాబట్టి జాగ్రత్తగా రాయాలి.
  • పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందే పాస్​వర్డ్ వెల్లడిస్తారు. పాస్​వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సూచనలు వస్తాయి. ఆ తర్వాత పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి స్క్రీన్​పై ప్రశ్నలు వస్తాయి. గడువు ముగిసిన తర్వాత స్క్రీన్​పై ప్రశ్నలు ఉండవు. ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే.. ఆటోమేటెడ్​గా అదనపు సమయం కంప్యూటర్​లో చూపిస్తుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.