గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించనున్న నేడు టీజీ సెట్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 433 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 48 వేల 240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 48 వేల 168 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 12న టీజీ సెట్ జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది.
కరోనా పరిస్థితులు నెలకొన్న తర్వాత పదేళ్ల వయసు విద్యార్థులు ఇంత భారీ సంఖ్యలో రాయనుండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో గదిలో 20 మందికి మించకుండా.. భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రవేశ పరీక్ష కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: మరింత జాగ్రత్తగా ఉండండి: ఈటల రాజేందర్