Telangana Group 4 Preliminary key Released Today : గ్రూప్- 4 ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కాపీలు, మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ(Preliminary key) వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. పేపర్-1 పరీక్షకు సంబంధించి 7,63,835, పేపర్ -2 పరీక్షకు సంబంధించి 7,61,028 మంది అభ్యర్థులు హాజరైయ్యారని వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల కాపీలను సెప్టెంబర్ 27 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
TSPSC Group 4 KEY Objections Date : జులై 1న జిల్లా అధికారుల నుంచి తీసుకున్న ఫోన్ ద్వారా తీసుకున్న ప్రాథమిక సమాచారం మేరకు పేపర్-1 పరీక్షకు 7,62,872 మంది, పేపర్ -2 పరీక్షకు 7,61,198 మంది హాజరైనట్లు సమాచారం అందిందని.. అయితే జిల్లాల నుంచి ఓఎంఆర్ పత్రాలను తీసుకుని ఇమేజింగ్ చేసిన తర్వాత హాజరైన అభ్యర్థుల సంఖ్యపై కమీషన్ స్పష్టత ఇచ్చింది. గ్రూఫ్- 4 పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈనెల 30 తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈమేరకు టీఎస్పీఎస్సీ(TSPSC) వెబ్సైట్లో ప్రత్యేక లింకు ద్వారా నమోదు చేయాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. అభ్యంతరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింకు ద్వారా వచ్చిన బాక్సులో ఆంగ్లంలో నమోదు చేయాలన్నారు. ఈ-మెయిల్స్ ఇతర వ్యక్తిగత విజ్ఞాపనల ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ https:/www.tspsc.qov.inను సందర్శించాలని సూచించారు.
TSPSC Group 4 Official WebSite : రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష జులై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించింది. మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగింది. రెండో పేపర్ మధ్యాహ్నం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలను రాశారు. ఆలస్యం కారణంగా కొందరని.. సరైన పత్రాలు లేకపోవడంతో మరికొందరిని అధికారులు వెనక్కి పంపించారు. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులనూ పరీక్ష నిర్వహణ సిబ్బంది తిప్పి పంపించారు. ఓ పరీక్షా కేంద్రానికి గ్రూప్-4 అభ్యర్థి సెల్‌ఫోన్ తీసుకురాగా.. ఆ విషయాన్ని గుర్తించిన అధికారులు అతడ్ని డీబార్ చేశారు.
Telangana Group 4 Exam : రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష
TSPSC Group 4 Exam 2023 : గ్రూప్-4 పరీక్ష.. సెల్‌ఫోన్‌తో ఎగ్జామ్ హాల్లోకి.. చివరకు...
Telangana Group 4 Exam : గ్రూప్ 4 పరీక్ష.. ఆలస్యంగా కేంద్రానికి.. జస్ట్‌లో మిస్ అయిన అభ్యర్థులు