రాష్ట్రంలో పలువురు అఖిల భారత సర్వీసు అధికారులకు పదోన్నతులు లభించాయి. పదోన్నతులు పొందిన వారిలో 33 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, సునీల్ శర్మకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు అధికారులను ఐఏఎస్ ఎపెక్స్ స్కేల్‌కు పదోన్నతి కల్పించేందుకు ప్యానెల్ చేశారు. రజత్ కుమార్, రామకృష్ణారావు, హర్ ప్రీత్ సింగ్, అర్వింద్ కుమార్, అశోక్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాకు అర్హత పొందారు. ఒకే ఖాళీ ఉన్న నేపథ్యంలో రజత్ కుమార్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. తదుపరి ఖాళీలు వచ్చిన వెంటనే మిగతా వారికి కూడా స్పెషల్ సీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తారు. 1996 బ్యాచ్ అధికారులు దానకిశోర్, జనార్దన్ రెడ్డిలు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. 2005 బ్యాచ్‌కు చెందిన గౌరవ్ ఉప్పల్, మాణిక్కరాజ్, చంపాలాల్, ఇలంబర్తిలకు కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. 2006 బ్యాచ్‌కు చెందిన వెంకటరామిరెడ్డి, 2000 బ్యాచ్‌కు చెందిన శ్రీదేవసేనలు సెలక్షన్ గ్రేడ్ స్థాయికి పదోన్నతి పొందారు. 2011 బ్యాచ్‌కు చెందిన శ్వేతా మహంతి, పాటిల్ ప్రశాంత్ జీవన్, కిల్లు శివకుమార్ నాయుడు, 2012 బ్యాచ్‌కు చెందిన కృష్ణభాస్కర్, అలగు వర్షిణి, రాజీవ్ గాంధీ హన్మంతు, ఆర్వీ కర్ణన్, కొర్రా లక్ష్మీలకు జూనియర్ పరిపాలన గ్రేడ్ స్కేలుకు పదోన్నతి కల్పించారు. 2016, 2017 బ్యాచ్‌లకు చెందిన బదావత్ సంతోష్, ముజమ్మిల్ ఖాన్, మను చౌదరి, ఐలా త్రిపాఠి, రాహుల్ శర్మ, రాజర్షిషా, ప్రతీక్ జైన్, స్నేహలత, వెంకటేష్, బీఎం సంతోశ్లు సీనియర్ టైంస్కేలుకు పదోన్నతి పొందారు.
ఐపీఎస్ పదోన్నతులు:
1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు చారుసిన్హా, అనిల్ కుమార్, వీసీ సజ్జనార్ అదనపు డీజీలుగా పదోన్నతి పొందారు. 2003 బ్యాచ్‌కు చెందిన షానవాజ్ ఖాసింకు ఐజీగా పదోన్నతి లభించింది. 2007 బ్యాచ్‌కు చెందిన విక్రంజీత్ దుగ్గల్‌కు డీఐజీగా ప్రమోషన్ దక్కింది. 2008 బ్యాచ్‌కు చెందిన తౌసీఫ్ ఇక్బాల్‌కు సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి దక్కింది. 2013 బ్యాచ్‌కు చెందిన చేతన, 2015 బ్యాచ్‌కు చెందిన రాజేశ్ చంద్ర, 2016 బ్యాచ్‌కు చెందిన సాయి చైతన్య, శరత్ చంద్ర పవార్‌కు ఐపీఎస్ సీనియర్ టైంస్కేల్ హోదాకు పదోన్నతి కల్పించారు.
పీసీసీఎఫ్‌గా ఆర్.శోభ:
1986 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ఆర్.శోభను పూర్తి స్థాయి పీసీసీఎఫ్‌గా నియమించారు. 1996 బ్యాచ్‌కు చెందిన సునీతా భగవత్‌కు అదనపు పీసీసీఎఫ్‌గా పదోన్నతి కల్పించారు. 2003 బ్యాచ్‌కు చెందిన షఫియుల్లా, ప్రియాంకా వర్గీస్, వినోద్ కుమార్, రామలింగం, ఆశాలకు సూపర్ టైం స్కేల్ ఐఎఫ్ఎస్ అధికారులుగా పదోన్నతులు కల్పించారు. 2015 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ కుమార్ శెెెట్టికి సీనియర్ టైం స్కేల్ పదోన్నతి దక్కింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పదోన్నతులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటికి ఇవాళ ఆమోదముద్ర వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వారి అర్హత ప్రకారం ఏయే తేదీల నుంచి పదోన్నతులు ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చిన్నట్లు ఉత్తర్వుల్లో పదోన్నతుల తేదీని పేర్కొన్నారు.