గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ పర్యటనలో భాగంగా... ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సౌందరరాజన్... రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న అంశాలపై ప్రధానికి వివరించారు. ప్లాస్టిక్ నిషేధం, యోగా తరగతులు, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలపై నివేదిక అందించగా... గవర్నర్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అనంతరం తమిళిసై కేంద్రం హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. గవర్నర్‌గా పాల్గొన్న సామాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబురాలపై ప్రతులను అందించారు.
ఇవీ చూడండి: సమ్మెపై ప్రభుత్వ, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి