Heavy Rains In Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భాారీ వర్షం కురిసింది. భాగ్యనగరంతో పాటు నగర శివార్లలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొండాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లిలో వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీకాలనీ ప్రాంతాలను వాన ముంచెత్తింది.
మరోవైపు మూసాపేట్, నిజాంపేట్, ప్రగతినగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలో కొద్ది సేపట్లోనే భారీవర్షం పడింది. ఫలితంగా రహదారులపైకి భారీగా వాననీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వాహనదారులకు తప్పని తిప్పలు : ఎండ వేడితో ఇబ్బందిపడే నగర వాసులను మధ్యాహ్నం 3గంటల సమయంలో కురిసిన వర్షం చల్లదనాన్నిచ్చింది. కూకట్‌పల్లి ప్రాంతంలో కొద్దిసేపు కురిసిన వర్షం కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద నిలబడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం లింగంపల్లి చందానగర్ మియాపుర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చందానగర్ ముంబై జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో రహదారి పై భారీగా వరద నీరు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్లపైకి చేరిన వరదనీరు : మాదాపూర్ కేపీహెచ్‌బీ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో యశోద హాస్పిటల్ దగ్గర ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీలో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. కొండాపుర్ డివిజన్ మార్తాండనగర్‌లో రోడ్డుపై వరదనీరు చేరి చెరువును తలపించింది. ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈఎస్ఐ, బోరబండ, సనత్ నగర్, యూసఫ్ గూడా, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
ట్రాఫిక్‌నకు అంతరాయం : లింగంపల్లి రైల్వే అండర్‌పాస్ కింద భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. రహదారులపై వర్షపునీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది.
పిడుగుపాటుతో : వాతావరణ మార్పులు వల్ల కొన్నిచోట్ల ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. అప్పటివరకూ ఎండలతో మండుతున్నట్లుండే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షపు జల్లులను కురిపిస్తున్నాయి. పిడుగుపాటుకు మృతిచెందితున్న ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకుంటున్నారు.
తెలంగాణకు రెయిన్ అలర్ట్ - రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
హైదరాబాద్‌లో భారీ వర్షం - మరో రెండురోజుల పాటు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్