ETV Bharat / state

ఉపాధి హామీ పథకంలో వ్యూహం మార్చిన రాష్ట్ర ప్రభుత్వం - ఉపాధిహామీ పథకం వార్తలు

ఓ వైపు ఉపాధి, మరోవైపు ప్రజాపయోగ పనులు... ఇదీ ఉపాధిహామీ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. పథకం నిధులను వినియోగించుకొని వివిధ శాఖల్లో అభివృద్ధి, మరమ్మత్తుల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల్లో ఇప్పటికే పనులు కొనసాగుతుండగా... మిగతా శాఖల్లోనూ చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

telangana-government-utilize-national-rural-employment-guarantee-act
ఉపాధి హామీ పథకంలో వ్యూహాన్ని మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : Jul 3, 2020, 8:23 AM IST

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని... వ్యవసాయానికి అనుసంధానించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటికీ సానుకూల స్పందన రాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వ్యూహం మార్చింది. ఉపాధి హామీ పథకంలో ఉన్న మార్గదర్శకాలకు లోబడి వివిధ శాఖల్లో అభివృద్ధి, మరమ్మత్తులను చేపట్టాలని నిర్ణయించింది.

ఆయా శాఖల్లో కూలీల సాయంతో చేసే అభివృద్ధి పనులతో పాటు... మరమ్మత్తులు, పూడికతీత, నిర్మాణాలు వంటి వాటిని ఉపాధిహామీతో అనుసంధానించి పూర్తిచేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ విషయంపై ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. వీలైనన్ని శాఖల్లో ఎక్కువ పనులు చేసి... పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామీణాభివృద్ధిలో...

ఇప్పటికే హరితహారం కింద మొక్కలు నాటడం, సంరక్షణ పనుల్లో అవసరమైన చోట ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేసే వివిధ పనులతో పాటు కొత్తగా కల్లాల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రతి ఏటా లక్ష కల్లాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ ఏడాది 750 కోట్ల రూపాయలను కేటాయించి... ఆచరణలోకి తెచ్చింది. డంపింగ్ యార్డుల నిర్మాణం, ఇతర పనుల కోసం కూడా ఉపాధిహామీ నిధులను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.

కాల్వల మరమ్మత్తులు...

నీటిపారుదల శాఖలోనూ ఉపాధిహామీ నిధులతో పనులు చేపట్టారు. జగిత్యాల జిల్లాలో జలహితం పేరిట కాల్వలకు మరమ్మత్తులు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనూ అదే తరహాలో కాల్వల మరమ్మత్తులు, పూడికతీత పనులు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాల్వల మరమ్మత్తులు, పూడిక తీత పనులను చేపట్టారు. 7000 కిలోమీటర్లకు పైగా మరమ్మత్తులు, పూడికతీత పనులు చేపట్టేలా రూ.1231 కోట్లతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్లకు ఇందుకు సంబంధించి శిక్షణ కూడా ఇచ్చారు. ఇటీవలే మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి సహా ఇతరులు ఆయా జిల్లాల్లో పనులకు శ్రీకారం చుట్టారు.

అంగన్​ వాడీల నిర్మాణాలు...

ఆర్​ అండ్​ బీ శాఖలోనూ ఉపాధిహామీ నిధులతో పనులు చేపట్టనున్నారు. రహదారుల వెంట మట్టి పోయడం, పొదల తొలగింపు పనులు, సూచికలకు రంగులు, సున్నం వేయడం లాంటి పనులు చేపట్టనున్నారు. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మహిళా సంక్షేమ శాఖలో అంగన్ వాడీల నిర్మాణ పనులు సహా ఇతరత్రా చోట్ల మానవ ప్రమేయం అవసరమైన పనులకూ ఉపాధి హామీ నిధులను వినియోగించాలని నిర్ణయించారు.

అటవీ అభివృద్ధి, పునరుద్ధరణ పనుల్లోనూ... కందకాల తవ్వకం, కట్టల నిర్మాణం లాంటి పనులకు ఈ నిధులను ఉపయోగిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ పనుల్లో కూడా అవకాశం ఉన్న చోట ఉపాధి హామీ నిధులను వినియోగించనున్నారు. మిగతా శాఖల్లోనూ ఉపాధిహామీ నిధులతో పనులు చేపట్టేలా మరిన్ని ప్రణాళికలు రూపొందుతున్నాయి.

ఇవీ చూడండి: సీఎం కేసీఆర్​కు లేఖ రాసిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.