రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్రంలోని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేస్తామని పేర్కొంది. ఈ మేరకు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్య సమాచారం సేకరణ
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో భవిష్యత్తులో అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచార విశ్లేషణ వలన వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్‌ని గుర్తించవచ్చని వెల్లడించారు.
-
ములుగు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్న కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈ రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయనున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ములుగు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్న కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈ రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయనున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2021ములుగు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్న కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈ రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయనున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2021
పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాలు
ఈ ప్రాజెక్టుకు పైలెట్ కింద రాష్ట్రంలో చిన్న జిల్లాలైన ములుగు, సిరిసిల్లను ఎంచుకున్నామని తెలిపారు. ముందుగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న వైద్యశాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా బిపీ, షుగర్, వివిధ రక్త, మూత్ర పరీక్షల వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరిస్తామని చెప్పారు. ఎవరికైనా అదనపు పరీక్షల అవసరం అయితే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, పరికరాలను అందజేస్తామని చెప్పారు. ఇలాంటి హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
పవర్ పాయింట్ ప్రదర్శన
ఈ సమావేశంలో పాల్గొన్న ఐటీ, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రాజెక్టు వివరాలను మంత్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా తాము చేపట్టబోయే పైలట్ ప్రాజెక్టు పైన ఒక పవర్ పాయింట్ ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించి మంత్రులు ఇచ్చిన పలు సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని మరో వారం రోజుల్లో పూర్తి మార్గదర్శకాలతో ఒక నివేదిక అందిస్తామని అధికారులు మంత్రులకు తెలిపారు.
అత్యవసర ఆరోగ్య సేవలు
ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాను ఎంచుకోవడం ద్వారా అక్కడి స్థానికులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్‌లు తెలిపారు. ముఖ్యంగా గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని వివరించారు.
ఇవీ చదవండి:
- gandhi hospital rape: అత్యాచారం చేయలేదు.. ఆమె అంగీకారంతోనే వెళ్లా: సెక్యూరిటీ గార్డు
- Gandhi Hospital Rape: గాంధీ ఘటనలో వీడని చిక్కుముడి.. ఇంకా లభించని బాధితురాలి ఆచూకీ
- GANDHI HOSPITAL: 'గాంధీలో అత్యాచారం జరిగే అవకాశం లేదు.. బురద జల్లే ప్రయత్నం చేయొద్దు'
- Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం
- Gandhi Hospital Rape: 'గాంధీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం' కేసులో సూపరింటెండెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు
- GANDHI HOSPITAL RAPE CASE: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అక్కడ ప్రతిదీ అనుమానమే!