ETV Bharat / state

రెండో విడత కంటి వెలుగు.. జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధం - కంటి వెలుగు పథకం

Second Phase Kanti Velugu program in Telangana: రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. జనవరి 18 నుంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. దీంతో బాధితుల్లో అశలు చిగురిస్తున్నాయి. మొదటి విడత 2018 ఆగస్టు 15 నుంచి 2019 మార్చి 31 వరకు కొనసాగించిన ప్రభుత్వం.. జిల్లాల వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించింది. ఆ తరువాత పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేసింది.

Kanti Velugu program
Kanti Velugu program
author img

By

Published : Nov 20, 2022, 8:27 AM IST

Second Phase Kanti Velugu program in Telangana: రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. జనవరి 18 నుంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. దీంతో బాధితుల్లో అశలు చిగురిస్తున్నాయి. మొదటి విడత 2018 ఆగస్టు 15 నుంచి 2019 మార్చి 31 వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ ఆ తరువాత పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేసింది. శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించినా ఇప్పటి వరకు చికిత్సలు చేయించలేదు. పలువురు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు.

6 లక్షల 47 వేల 684 మందికి పరీక్షలు: జిల్లా జనాభా 9 లక్షల 85 వేల 417 కాగా మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 8 నెలల పాటు 18 మండలాల్లో 238 గ్రామాలు, 93 పురపాలక వార్డుల్లో 23 ప్రత్యేక బృందాలు గ్రామాలు. పురపాలక సంఘాల వారీగా క్షేత్రస్థాయిలో 2,474 వైద్య శిబిరాలు నిర్వహించి 6 లక్షల 47 వేల 684 మందికి కంటి పరీక్షలు చేశారు.

75 వేల 463 మందికి రీడింగ్‌ అద్దాలు అవసరమని గుర్తించి 72 వేల 316 మందికి అద్దాలు అందించారు. కళ్ల మధ్య తారతమ్యాలు ఉండేవారికి రెండు అద్దాలతో కూడిన కళ్లజోళ్లు 95 వేల 337 మందికి అవసరమని గుర్తించినా ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయారు. 15 రోజుల్లో వస్తాయని ప్రకటించినా అప్పటి నుంచి అధికారులు ఇదిగో అదిగో అంటూ రోజులు గడుపుతున్నారు.

శస్త్రచికిత్సలకు 14 వేల 894 మంది: జిల్లా వ్యాప్తంగా 14 వేల 894 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికత్సలు చేయిస్తామని అధికారులు అతీగతీలేకుండా పోయారు. అధిక శాతం మంది శస్త్రచికిత్సలకు ఎదురుచూస్తుండగా పలువురు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు.

కొందరు శస్త్రచికిత్సకు ఎదురుచూసి మరణించారని తెలుస్తోంది. వైద్యఆరోగ్య శాఖ నుంచి ఆయా ఆసుపత్రులకు అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో శస్త్రచికిత్సలను అక్కడితో నిలిపివేశారని తెలుస్తోంది.

"ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే శిబిరాలు నిర్వహిస్తాం. శిబిరాలు, చికిత్సలు, అద్దాల అవసరాలపై సమీక్ష నిర్వహించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు జిల్లా వివరాలతో నివేదికను పంపిస్తాం. గతంలో చేసిన పరీక్షలు, ఇప్పటికి ఉండే వ్యత్యాసాలను గుర్తించి చర్యలు తీసుకుంటాం".- డాక్టర్‌ పి.శ్రీధర్‌, జిల్లా వైద్య అధికారి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.