చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర విచారణకు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది. నాంపల్లి, ఎల్బీనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ కోర్టులు పనిచేయనున్నాయి. హైకోర్టు పరిపాలన రిజిస్ట్రార్ నివేదిక ఆధారంగా పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చూడండి: ఈఎస్ఐ స్కాం: 23 మంది ఇళ్లలో అనిశా సోదాలు