ETV Bharat / state

N.V. RAMANA:సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణను ఘనంగా ఆహ్వానించిన సర్కార్​! - Justice NV Ramana telangana tour

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు రాష్ట్రప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. ప్రధాన మార్గాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి సాదరంగా రాష్ట్రానికి ఆహ్వానించింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్న జస్టిస్‌ రమణ దంపతులకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు పుష్పగుచ్ఛాలు అందించారు.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణను ఘనంగా ఆహ్వానించిన సర్కార్​!

author img

By

Published : Jun 12, 2021, 5:21 AM IST

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శుక్రవారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు హార్దిక స్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రధాన మార్గాల్లో ఫ్లెక్సీలను, హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఆయన్ను రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ రమణ, శివమాల దంపతులకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జస్టిస్‌ రమణ దంపతులను.. గవర్నర్‌ తమిళిసై, సౌందరరాజన్‌ దంపతులు, సీఎం కేసీఆర్‌ సత్కరించారు. సీజేఐ దంపతులకు ముఖ్యమంత్రి రజత వీణను బహూకరించారు. రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెంచేందుకు చూపిన చొరవపై కేసీఆర్‌ ఈ సందర్భంగా జస్టిస్‌ రమణకు ధన్యవాదాలు తెలిపారు.

.
.
.

తిరుమల నుంచి....
తిరుమల నుంచి హైదరాబాద్‌ చేరుకున్న సీజేఐకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి స్వాగతం పలికారు. మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీ, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, తెరాస ఎంపీలు కె.కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, ముఠా గోపాల్‌, మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీ, భాస్కర్‌రావు, కోనేరు కోనప్ప, కాలేరు వెంకటేశ్‌, జీవన్‌రెడ్డి, కాలె యాదయ్య, జైపాల్‌యాదవ్‌, అంజయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షడు సూర్యకరణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌. రాజేశ్వర్‌రావు తదితరులు జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు. ఆయన రాక సందర్భంగా నగరంలో భారీగా పోలీసు భద్రత కల్పించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమాల మధ్యలో జస్టిస్‌ రమణ సంజీవరెడ్డినగర్‌లోని తన నివాసానికి వెళ్లి వచ్చారు. రాజ్‌భవన్‌లోని అతిథి గృహంలో బస చేసిన జస్టిస్‌ రమణ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటారు. వివిధ కార్యక్రమాలు, సదస్సుల్లో పాల్గొంటారు.

.
.

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విందు
జస్టిస్‌ ఎన్‌వీ రమణ గౌరవార్థం గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో శుక్రవారం రాత్రి విందు ఇచ్చారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. జస్టిస్‌ రమణకు స్వాగతం పలికేందుకు రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ అనంతరం గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, లాక్‌డౌన్‌, టీకాలు, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ చర్యలు, ధాన్యం సేకరణ, వానాకాలం పంటల సాగు, ఆర్థిక పరిస్థితులు, రైతుబంధు సాయం తదితర అంశాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించినట్లు తెలిసింది.

భారత న్యాయ దిగ్గజం పుస్తకావిష్కరణ

.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జీవిత విశేషాలపై ముద్ర వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సహకార సొసైటీ ఛైర్మన్‌ తిప్పినేని రామదాసప్పనాయుడు రూపొందించిన ‘భారత న్యాయ దిగ్గజం’ పుస్తకాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం రామదాసప్పనాయుడు బర్కత్‌పురలో విలేకరులతో మాట్లాడుతూ, జస్టిస్‌ రమణ సహా న్యాయ కోవిదులు ఇచ్చిన తీర్పులు, న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు.

ఇదీ చూడండి: రాజ్​భవన్​లో సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణకు ఘనస్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.