TS GOVT Training for unemployed on Tomcom : విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే కార్మికులు మోసాల బారిన పడడం.. అప్పులు చేసి నష్టపోవడం ఏజెంట్ల చేతిలో మోసపోవడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంది. దీనికోసం కార్మికశాఖ పర్యవేక్షణలో టామ్ కామ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది.
టామ్ కామ్ ద్వారా రాష్ట్రం నుంచి విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే అభ్యర్థులు టామ్ కామ్ వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆయా కంపెనీల కార్మికులకు ఉచితంగా ప్రయాణ, ఉండటానికి వసతిని కల్పిస్తున్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ , కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ద్వారా తెలంగాణ నుంచి అర్హత, నైపుణ్యం కలిగిన, సెమీస్కిల్డ్ కార్మికులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు చూపుతోంది. గల్ఫ్ దేశాలతో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, హంగేరి, రొమేనియా, పోలాండ్, జర్మనీ, జపాన్, యూకే వంటి దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రిజిస్టర్డ్ ఏజెన్సీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
ప్రస్తుతం జర్మనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటర్లు, ప్రాజెక్ట్ మేనేజర్, కన్సల్టెంట్స్, ఐటీ ఉద్యోగాలను అందిస్తోంది. ఈ ఉద్యోగులకు ఏడాదికి వేతనం రూ.41 లక్షలు నుంచి రూ.71 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని టామ్ కామ్ అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగానికి అభ్యర్థి సంబంధిత రంగంలో 3 నుంచి 5 సంవత్సరాల అనుభవంతో గ్రాడ్యుయేట్ అర్హతలు ఉంటాయి.
Skill Development Centers in Telangana : జర్మన్ భాషలో ప్రావీణ్యం ఉన్న వారికి కూడా అవకాశాలున్నాయి. వీరు బీ1/బీ2 స్థాయిలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. అర్హత గల అభ్యర్థులు టామ్‌కామ్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అభ్యర్థులు తమ పూర్తి సమాచారం tomcom.itcoordinator@gmail.comకి ఈ-మెయిల్ చేయాలని సూచించారు. లేదా www.tomcom.telangana.gov.in ని 9849639539, 7893566493 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.
అమెరికాలోని ఆసుపత్రుల్లో నర్సులుగా చేసేందుకు బీఎస్సీ నర్సింగ్ చేసి, రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వేతనం కూడా ఏడాదికి రూ. 34 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కానీ ఐఈఎల్ టీఎస్ ఇంగ్లీష్ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉంది. జర్మనీలో ఆసుపత్రుల్లో నర్సులుగా చేసేందుకు బీఎస్సీ డిగ్రీ చేసిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. జర్మనీ నర్సులుగా ఉద్యోగాల్లో చేరాలంటే జర్మనీ భాష తప్పనిసరిగా రావాలంటున్నారు. వేతనం నెలకు రూ.2లక్షల ప్రారంభం కానుందని వెల్లడించారు.
Training for unemployed on Tomcom : పోలాండ్ దేశంలో వెల్డర్స్ ఫిట్టర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. 5 ఏళ్ల అనుభవం ఉన్న వారికి వేతనం నెలకు రూ.1.13 లక్షల వేతనంతో ప్రారంభం కానుందని చెప్పారు. దుబాయ్‌లో ఏసీ టెక్నీషియన్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడిచారు. పదో తరగతి లేదా ఐటీఐతో పాటు 2-3 ఏళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నెలకు వేతనం రూ.33 వేలు జీతం ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి: