ETV Bharat / state

విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు నియామకం

author img

By

Published : May 22, 2021, 7:08 PM IST

Updated : May 22, 2021, 7:53 PM IST

vice chancellors
ఉపకులపతులు నియామకం

19:06 May 22

విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు నియామకం

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకంపై నిరీక్షణకు తెరపడింది. పది విశ్వ విద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ... ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు వెలువరించింది. యూనివర్సిటీలకు 2019 జూన్‌ నుంచి ఐఏఎస్ అధికారులే ఇన్‌ఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు. అదే ఏడాది.. జులైలోనే వీసీల నియామకానికి దరఖాస్తులు స్వీకరించినా... తదుపరి ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ జాప్యంపై విద్యావేత్తలు, గవర్నర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాయి. 

అయితే.. వరస ఎన్నికలు, కరోనా ప్రభావం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ... అన్వేషణ కమిటీ సూచించిన పేర్ల నుంచి ఒక్కో వర్సిటీకి ముగ్గురు పేర్లతో జాబితాను ముఖ్యమంత్రి కార్యాలయం.. గవర్నర్‌కు పంపింది. ఈ జాబితాను పరిశీలించిన గవర్నర్... వీసీల పేర్లను ఖరారు చేస్తూ దస్త్రంపై సంతకాలు చేశారు. ఈ దస్త్రం అందిన వెంటనే విద్యాశాఖ....పది యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

విశ్వవిద్యాలయంవీసీ పేరు
ఉస్మానియా డి.రవీందర్‌
కాకతీయటి.రమేశ్‌ 
మహాత్మాగాంధీసి.హెచ్‌.గోపాల్‌రెడ్డి
తెలంగాణరవీందర్‌
పాలమూరులక్ష్మీకాంత్‌ రాఠోడ్​
శాతవాహన మల్లేశం
జేఎన్‌టీయూకట్టా నర్సింహారెడ్డి
జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ డి.కవిత
అంబేడ్కర్‌ సార్వత్రిక వర్సిటీసీతారామారావు
తెలుగు వర్సిటీటి.కిషన్‌రావు

ఇదీ చదవండి: అమానవీయం: ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి

Last Updated : May 22, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.