ETV Bharat / state

నష్టపరిహార చెల్లింపుల్లో జాప్యం... రైతులకు తప్పని నిరీక్షణ

Farmers Crop Compensation delay: రాష్ట్రంలో వ్యవసాయ పంటల నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం రాజ్యమేలుతోంది. 2020 వానాకాలం సీజన్‌లో సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటలు అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న విమర్శలు ఉన్నాయి. భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి తగిన పరిహారం అందించాలని కోరుతూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించినా ఇంకా సాయం కోసం బాధిత రైతులు నిరీక్షిస్తుండటం గమనార్హం.

author img

By

Published : Jan 6, 2022, 5:08 PM IST

Farmers
Farmers

Farmers Crop Compensation delay: రాష్ట్రంలో 2021 వానాకాలం సీజన్‌లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో జరిగిన నష్టం నుంచి రైతులు బయటపడటం లేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వివిధ దశల్లో కురిసిన భారీ వర్షాలు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలను దెబ్బతిశాయి. సెప్టెంబరు 27,29 తేదీల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మరిన్ని లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినడం వల్ల రైతులు అపార నష్టం చవిచూడాల్సి వచ్చింది. సెప్టెంబరు మొదటి వారంలో పడిన భారీ వర్షాల ప్రభావంతో 6.3 లక్షల ఎకరాలు, నాలుగవ వారంలో 2.1 లక్షల ఎకరాలు... మొత్తం 12.8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా.

దెబ్బతిన్న పంటలు...

ప్రధాన ఆహార పంట వరి సహా పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, కంది, పెసర, మినుము, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల మీదుగా నీరు వరదలా ప్రవహించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు వివిధ రిజర్వాయర్ల పరిధిలో బ్యాక్ వాటర్‌ వల్ల కూడా వేలాది ఎకరాల పంట భూములు నీట మునిగిపోయాయి. చెరువులకు కాల్వలకు గండ్లు పడి నీరు పొలాలను ముంచెత్తాయి. రోజుల తరబడి నీరు బయటకు పోక అన్ని పంటల మొక్కలు కుళ్లిపోయాయి. సోయా పొలాల్లోనే మొలకెత్తింది. ముందస్తు నాట్లు వేయడం వల్ల వరి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిగిలిన వరిపై కూడా సీజన్‌ చివరిలో ఎంత దిగుబడి వస్తుందో చెప్పలేని పరిస్థితి.

పొలాల్లో ఉన్న తుంపర, బిందు సేద్యం సాంకేతిక పరిజ్ఞానం పరికరాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. పొలాల్లో వేసుకున్న షెడ్లు కూడా దెబ్బతిన్నాయి. 2020 వానాకాలం సీజన్‌ నుంచి ప్రధానమంత్రి పంట బీమా పథకం- పీఎంఎఫ్‌బీవై, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. కొత్తగా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పంటల బీమా పథకాలు రూపొందించి అమలు చేయడం లేదు. ఫలితంగా రైతులు ప్రకృతి వైపరీత్యాల బారినపడి పంటలు దెబ్బతిని నష్టపోతే మాత్రం బీమా పరిహారం కూడా అందడం లేదు.

అందని బీమా...

2018-19, 2019-20 సంవత్సరాల పంటల బీమా ప్రీమియం కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీమా కంపెనీలకు నగదు చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇంత వరకూ బీమా పరిహారం కూడా అందిన పాపానపోలేదు. ఈ నేపథ్యంలో 2020 నవంబరులో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చి 2021 సెప్టెంబరు 28న హైకోర్టు తీర్పు వెలువరించింది. 2020 సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతుల వివరాలు మూడు మాసాల్లోపు సేకరించాలని ఇచ్చిన తీర్పు ప్రకారం డిసెంబరు 28 నాటికి గడువు పూర్తైంది. ఈ నమోదు ప్రక్రియలో కేవలం భూమి యజమానులు మాత్రమే కాకుండా నష్టపోయిన కౌలు రైతుల వివరాలు కూడా తప్పకుండా సేకరించడం సహా ఈ ఏడాది జనవరి 28వ తేదీలోగా పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రైతు స్వరాజ్య వేదిక ఆక్షేపించింది.

రైతుబంధు మినహా...

2020 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా విపరీతమైన భారీ వర్షాలు కురిసి రైతులు పంటలు కోల్పోయారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాసి 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణం పైగా భూముల్లో పంటల నష్టం జరిగిందని నివేదించారు. కేంద్ర బృందం పర్యటనకు వచ్చినప్పుడు రూ. 8,633 కోట్ల నష్టం సంభవించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదికలో స్పష్టమైంది. పంట నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయినా రైతుబంధు పథకం కింద లబ్ధిదారులకు తప్ప మిగతా ఏ ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. ఇదే విషయంపై రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వచ్చిన తీర్పు రైతులకు సంబంధించి చాలా ముఖ్యమైంది.

హైకోర్టు తీర్పు అమలుకు రైతు సంఘాల డిమాండ్...

రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పు స్ఫూర్తి అర్థం చేసుకుని అమలు చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించడంతో పాటు ప్రస్తుత సీజన్‌తో మొదలుపెట్టి ప్రకృతి వైపరిత్యాల పరిహారం, పంట బీమా, కౌలు రైతుల విషయాల్లో చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2021 వానా కాలం సీజన్‌లో వివిధ దశల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా... ముఖ్యంగా భారీ వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టం దృష్టిలో పెట్టుకుని జాతీయ విపత్తు నిధి మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహారం అందించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పశువుల మరణాలు, మేకలు, గొర్రెల మరణాలు సంభవించిన చోట ఆ వివరాలు కూడా నమోదు చేయాలి. పొలాల్లో షెడ్లు, పశువుల పాకలు, సూక్ష్మసేద్యం సౌకర్యాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆ సమాచారం కూడా నమోదు చేయాలన్నది మరో డిమాండ్.

కేంద్ర పథకాలు నిలిపేసి...

2020-2021 యాసంగి సీజన్‌లో కూడా పంటల బీమా పథకాలు అమల్లో లేకపోవడంతో రైతులు నష్టపోయారు. మామిడి రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలై ఉంటే నష్టపరిహారం లభించి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2020 ఖరీఫ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం... ప్రధానమంత్రి పంట బీమా పథకం అమలు నిలిపేసింది. ఆంధ్రప్రదేశ్ తరహాలో చిన్న, సన్నకారు రైతులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే భరించాలి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమబంగా తదితర రాష్ట్రాల తరహాలో తెలంగాణలో కూడా సమగ్ర బీమా పథకం ప్రవేశపెట్టి అమలు చేయాలని... అవి అమలై ఉంటే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడేవి. ఇంత సంక్షోభం నెలకొనేది కాదని... తక్షణమే ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది.

సర్వత్రా అసంతృప్తి...

హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు నోచుకోకపోవడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2020 వానాకాలం భారీ వర్షాలకు నష్టపోయిన రైతులతోపాటు కౌలు, మహిళా, పోడు రైతులను చేర్చేందుకు వ్యవసాయ శాఖ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని రైతు స్వరాజ్య వేదిక స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా బాధిత రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ కింద మళ్లీ న్యాయస్థానం ఆశ్రయిస్తామని పేర్కొంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.