ETV Bharat / state

భౌతిక దూరం పాటిస్తూ... కల్లు గీసుకోవడానికి ఎక్సైజ్​ శాఖ అనుమతి

కల్లు గీసుకోవడానికి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అనుమతినిస్తున్నట్లు తెలిపారు. కానీ కల్లు కాంపౌండ్​లు మాత్రం తెరవద్దని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ... కల్లు విక్రయాలు జరపాలని పేర్కొన్నారు.

Telangana Excise Department Permission to White liqueur
భౌతిక దూరం పాటిస్తూ... కల్లు గీసుకోవడానికి ఎక్సైజ్​ శాఖ అనుమతి
author img

By

Published : May 13, 2020, 5:08 PM IST

భౌతిక దూరం పాటిస్తూ.. కల్లు గీసుకోవడానికి రాష్ట్ర ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అనుమతినిస్తున్నట్లు తెలిపారు. కల్లు కాంపౌండ్​లు తెరవద్దని అన్నారు. కంటైన్మెంట్​ ప్రాంతాల్లో కల్లు గీయవద్దని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ... కల్లు విక్రయాలు జరపాలని పేర్కొన్నారు.

ఔషధ గుణాలు ఉన్నటువంటి నీరాను తాగొచ్చని చెప్పారు. త్వరలో ట్యాంక్​ బండ్​పై నీరా అమ్మకాలు జరుపుతామని వెల్లడించారు. మాంసం, గుడ్లు తినాలని ప్రజలకు సూచించారు. కులవృత్తుల పునరుద్ధరణ జరుగుతుందని స్పష్టం చేశారు. 40 లక్షల మంది గీత కార్మికుల కుటుంబాలు కరోనా లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో కల్లు అమ్మకాలు నిలిచిపోయాయని అన్నారు. చెట్టు పన్ను రద్దు చేసి గీత కార్మికులకు భరోసానిచ్చినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా 3 లక్షల ఈత, తాటి చెట్లు నాటినట్లు చెప్పారు. సిరిసిల్లలో ప్రత్యేకంగా కర్జురా చెట్లు నాటినట్లు పేర్కొన్నారు.

భౌతిక దూరం పాటిస్తూ... కల్లు గీసుకోవడానికి ఎక్సైజ్​ శాఖ అనుమతి

కల్లు గీసుకోవడానికి గీత కార్మికులకు అనుమతినిస్తున్నాం. వారిని పోలీసులు ఆపవద్దు. భౌతిక దూరం పాటిస్తూ... విక్రయాలు జరిపాలి. 40 లక్షల మంది గీత కార్మికుల కుటుంబాలు కరోనా లాక్​డౌన్​తో ఇబ్బంది పడ్డాయి. ............ శ్రీనివాస్​ గౌడ్​, ఎక్సైజ్​ శాఖ మంత్రి

ఇదీ చదవండి: విషవాయువు కమ్మేసింది.. గుండెల్ని మెలిపెడుతోంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.