సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని మేడిబావి ప్రాంతానికి చెందిన రాధ అనే మహిళ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమెకు ముగ్గురు చిన్నారులు, ఓ కుమార్తె సంతానం. మహిళ మరణంతో వీరంతా నిరాశ్రయులుగా మారారు. ఆమె భర్త గతంలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న ఉప సభాపతి పద్మారావు గౌడ్ స్వయంగా ఆమె నివాసాన్ని సందర్శించి పిల్లలను ఓదార్చారు. వారిని గురుకుల పాఠశాలలో చదువుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని, నిత్యావసర సరకులను కుటుంబసభ్యులకు అందజేశారు.
ఇదీ చూడండి:మోదీ 'లాక్డౌన్ 2.0' స్పీచ్ హైలైట్స్