Corona Cases in telangana: తెలంగాణలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 25,989 మందికి టెస్టులు చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా 477 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 279 మంది కోలుకోవడం.. సున్నా మరణాలు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,960కి చేరినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈరోజు నమోదైన కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి.
మరోవైపు, తెలంగాణలో ఇప్పటివరకు 3,55,32,200 శాంపిల్స్ పరీక్షించగా.. 7,99,532మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 7,91,461 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా.. 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రివకరీ రేటు 98.99శాతం కాగా.. మరణాల రేటు 0.51శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
జిల్లాల వారీగా కేసులు ఇలా.. హైదరాబాద్‌లో అత్యధికంగా 258 కేసులు రాగా.. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్ -మల్కాజ్ గరిఇ జిల్లాలో 56, సూర్యాపేటలో 8, సంగారెడ్డి 7, వికారాబాద్ 6, జనగామ 4, మహబూబాబాద్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో మూడేసి కేసులు రాగా.. ఆదిలాబాద్, భద్రాద్రి, జోగులాంబ, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, మెదక్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు వెలుగుచూసినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
ఇవీ చదవండి: