ETV Bharat / state

Telangana Congress PEC Meeting Today : నేడు తెలంగాణ కాంగ్రెస్​ నేతల కీలక సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం..! - కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీల భేటీ

Telangana Congress PEC Meeting Today : శాసనసభ ఎన్నికల సన్నాహాలను తెలంగాణ కాంగ్రెస్ ముమ్మరం చేసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన... ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీలు ఇవాళ గాంధీభవన్‌లో భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీల బలాబలాలు, కర్ణాటకలో అభ్యర్థుల ఎంపికకు అనుసరించిన విధానం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Telangana Congress PAC Meeting Today
Telangana Congress
author img

By

Published : Aug 14, 2023, 8:49 AM IST

Telangana Congress PEC Meeting Today : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలో పార్టీలన్నీ తమ వ్యూహా, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్​ఎస్ ప్రతిపక్షాలకు ఛాన్స్​ ఇవ్వకుండా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ.. అలాగే జనాకర్షణ సాధించేందుకు సరికొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తున్నారు. తామేమి తక్కువ కాదంటూ ఈసారి ఎలాగైనా విజయబావుట ఎగరేయాలని ప్రతిపక్షాలూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్​ పార్టీ శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections 2023) సన్నాహాలను ముమ్మరం చేసింది.

Congress Strategy for Telangana Assembly Elections 2023 : అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా తమ కార్యకలాపాలకు టీ కాంగ్రెస్‌ పదునుపెడుతోంది. అభ్యర్ధుల ఎంపికలో కీలక పాత్ర పోషించనున్న ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీలు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్‌రావ్‌ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మరో 23 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు హాజరవుతారు. అదేవిధంగా ఇదే సమావేశంలో స్క్రీనింగ్‌ కమిటీకి(Congress Screening Committee meeting) చెందిన.. కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌, సభ్యులు బాబా సిద్దిఖీ, విగ్నేష్ మెవానీలు కూడా పాల్గొంటారు. ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగానే కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Congress Party Members For Elections 2023 : 60 నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ సభ్యుల జాబితా సిద్ధం..!

T Congress Assembly Elections 2023 Plans : ఇవాళ మొట్టమొదటిసారి సమావేశం అవుతున్న ఈ రెండు కమిటీలు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీల బలాబలాలు, కర్ణాటకలో అభ్యర్థుల ఎంపికకు అనుసరించిన విధానం, తెలంగాణలో ఎలాంటి విధానంతో ముందుకు పోతే... బీఆర్​ఎస్ ఎత్తులను చిత్తు చేయవచ్చు, తదితర అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, పీసీసీ బృందాలు వేర్వేరుగా చేసిన సర్వేలు ఏం చెబుతున్నాయి.. పార్టీలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి.. వాటిని ఏవిధంగా అధిగమించాలి తదితర విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్‌(Gandhi Bhavan) వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటించాలి.. సర్వేలతో పాటు రాజీకీయ, సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని సీనియర్‌ నాయకులు చేస్తున్న డిమాండ్‌ పరిశీలన, తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. తొలి జాబితా(T Congress Election Members First List) వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించాలని భావిస్తున్న పీసీసీ.. ఆ మేరకు కసరత్తు చేస్తోంది.

Telangana Congress Assembly Elections Campaigning Plan : ప్రచార శంఖారావం పూరించిన కాంగ్రెస్.. 'తరిమికొడదాం-తిరగబడదాం' నినాదంతో జనంలోకి

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.