ETV Bharat / state

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

Telangana Congress MLA Candidates List Delay : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడానికి.. పలు అడ్డంకులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ముఖ్య నాయకులు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తుండడం.. వామ పక్షాలతో పొత్తుల వ్యవహారం ఎటూ తేలకపోవడం లాంటివి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నవరాత్రులు సమయంలోనే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని.. కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన అనంతరం తలెత్తే అసంతృతులను బుజ్జగించే ప్రక్రియలో పార్టీ ఉన్నతస్థాయి నాయకులను రంగంలోకి దించనుంది.

Telangana Congress MLA Candiadtes List Delay :
Telangana Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 6:58 AM IST

Telangana Congress MLA Candidates List Delay కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జాప్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే

Telangana Congress MLA Candidates List Delay : అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు.. కాంగ్రెస్‌ పార్టీ(Telangana Congress) వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా జాతీయస్థాయిలో వామపక్షాలు కలిసొస్తున్నందున రాష్ట్రంలో పొత్తులపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు చెరో రెండు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. సీపీఐ మునుగోడు, హుస్నాబాద్, సీపీఎం కొత్తగూడెంతో పాటు మరొకస్థానం ఖమ్మంలోనే కావాలని కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిమాండ్ అధికంగా ఉండడంతో సీపీఐకి మునుగోడు, సీపీఎంకి హుస్నాబాద్ ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కొత్తగూడెం పొత్తులో భాగంగా సీపీఎంకి ఇవ్వాల్సి వస్తే అక్కడ నుంచి పోటీ చేయనున్న పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాలేరుకు.. అక్కడ పోటీ చేయాలనుకుంటున్న తుమ్మలను ఖమ్మానికి మార్పు చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Delay in Telangana Congress MLA Candidates List 2023 : కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజల్లో ప్రచారం జరుగుతుండడంతో.. పార్టీలో చేరేవాళ్లు అధికం అవుతున్నారు. ఇవాళ బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి(Kasireddy Narayana Reddy), ఆయన అనుచరుడు నాగర్‌కర్నూల్‌ జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరుకాకుండా మరికొందరు పార్టీలోకి వచ్చేందుకు.. సిద్ధంగా ఉండడంతో చర్చల స్థాయిలో ఉన్నందున ఏదోకటి తేలేవరకు అభ్యర్థుల ప్రకటన(Congres Mla Candidates) జాప్యం జరగనుందని తెలుస్తోంది. దసరా నవరాత్రుల సమయంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారని.. కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Telangana Congress MLA Candidates List 2023 : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. మరో వారంలో జాబితా

Congress MLA Candidates List 2023 : మరోవైపు అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే.. తలెత్తే అసంతృప్త జ్వాలలను విజయవంతంగా చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన జరిగిన మరుక్షణమే అసంతృప్తులను ఓదార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏ ఒక్కరు కూడా అసంతృప్తికి లోను అవ్వకూడదని.. ఏఐసీసీ భావిస్తోంది. అభ్యర్థుల గెలుపునకు ఆటంకం ఏర్పడుతున్నట్లు పార్టీ భావిస్తోంది.

Congress MLA Candidates List Telangana 2023 : సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా 119 నియోజకవర్గాలలో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్య నాయకుల పర్యటన నిర్వహింపజేసి.. ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు సోనియా గాంధీ(Sonia Gandhi) ప్రకటించిన ఆరు హామీల గ్యారెంటీ కార్డు జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ మినహా.. ఇతర రాష్ట్రాల నుంచి అనుభవం కలిగిన కాంగ్రెస్ నాయకులను తెలంగాణలో మోహరింప చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ట్రబుల్ షూటర్‌ను అందుబాటులో ఉంచి.. అసంతృప్తి చెలరేగకుండా బుజ్జగింపుల ద్వారా నియంత్రించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

మొదటి స్టేజీలో బయట నాయకుల వల్ల కాకుంటే.. అప్పటికే ప్రాంతాలవారీగా రంగంలోకి దించిన నాయకుల ద్వారా బుజ్జగింపు కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగానే 119 నియోజకవర్గాలలో 15 నియోజకవర్గాలను ఒక డివిజన్‌గా పరిగణించి.. ఒక్కో డివిజన్‌కు జయరాం రమేశ్, దిగ్విజయ సింగ్, వీరప్పమొయిలీ, అశోక్ చౌహాన్, పృథ్విరాజ్ చౌహాన్.. సుశీల్ కుమార్ షిండే తదితరులను బరిలోకి దింపనున్నారు. కింది స్థాయిలో పరిష్కారంకానీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు.

Congress Flash Survey Telangana : ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక మీద మరో లెక్క.. టెన్షన్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు

BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్​పై ఏఐసీసీ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.