ETV Bharat / state

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..! - Competition for Telangana Congress tickets

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై... మరోసారి సమావేశం కావాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపే ముందు.. ఇంకోసారి పున:పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు వంద నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎనిమిది గంటలపాటు సాగిన స్క్రీనింగ్‌ కమిటీ భేటీలో.. అభ్యర్థుల వడపోత పూర్తికాలేదు. వివిధ వర్గాల వినతుల పరిశీలనతోపాటు.. బయట పార్టీల నుంచి చేరికల దృష్ట్యా.. 20 తర్వాతే అభ్యర్థుల జాబితా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

Congress Screening Committee
Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 7:03 AM IST

Telangana Congress MLA Candidates List Delay కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యం

Telangana Congress MLA Candidates List Delay : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు.. ఈ వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ (Telangana Congress) ఇంకా తుది నిర్ణయం తీసుకోలేక పోతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన హస్తం పార్టీ... పూర్తి పారదర్శకంగా ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Congress MLA Tickets Issue : కాంగ్రెస్ ఆర్నెళ్లుగా సర్వేలపై సర్వేలు నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ పరంగానే కాకుండా.. నాయకుల వారీగా ఈ సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో జరిగిన సర్వేలతోపాటు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సర్వేలు, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు (Sunil Kanugolu)సర్వేలు, డీకే శివకుమార్‌ (DK Shivakumar) సర్వేతోపాటు స్థానిక నాయకత్వాలు కొన్ని సర్వేలు చేయించుకున్నట్లు సమాచారం. వీటిల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు మాత్రమే వెల్లడైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.

MLA Mynampally Fires on Harish Rao : 'హరీశ్‌రావు గల్లీ లీడర్‌ లెక్క మాట్లాడుతున్నారు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు'

Telangana Congress MLA Tickets War : ఇప్పటి వరకు పార్టీకి సేవలు చేసినా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth REDDY) , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) దగ్గరగా ఉన్నా.. ఇతర ముఖ్య నాయకులతో దగ్గరగా ఉన్నా టికెట్ల విషయంలో ఇవేమీ పని చేయవన్న సంకేతాలను బలంగా వినిపిస్తున్నాయి. దిల్లీలో ఆదివారం జరిగిన స్క్రీనింగ్ కమిటీ (Congress Screening Committee) సమావేశం.. గతం కంటే భిన్నంగా జరిగింది. మొదట స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో సమావేశమైన చైర్మన్ మురళీధరన్ (Muralidharan).. ఆ తర్వాత ఇద్దరు సభ్యులు, అనంతం ఒక్కొక్కరితో వేర్వేరుగా సమావేశమైనట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల తొలి జాబితా విడుదల మరింత ఆలస్యం కానుంది.

Congress Screening Committee Meeting : గతంలో దాదాపు 65 నియోజక వర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చి.. సింగిల్‌ నేమ్‌ ప్రతిపాదన చేయగా.. తాజాగా మరో 35 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినప్పటికీ.. మరో 19 చోట్ల అభ్యర్థులు సరైనవారు లేరని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపే ముందు మరొకసారి భేటీకావాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది.

Congress Leaders Protests Aganist BJP : 'రావణ్'​గా రాహుల్​గాంధీ పోస్ట్​పై కాంగ్రెస్​ నిరసనలు.. బీజేపీ కార్యాలయం​ ముట్టడికి యత్నం

Congress MLA Candidates List Telangana 2023 : ప్రధానంగా వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను కూడా అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాలని కోరడంతోపాటు.. మరికొందరు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు చొరవ చూపుతుండడంతో ఈ రెండింటిపై రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ నెల 20వ తేదీ లోపు జాబితా వెలువడే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి వామపక్షాలతో పొత్తు ఉండాలా వద్దా..? ఉంటే ఎన్ని సీట్లు ఇవ్వాలనే బాధ్యతను.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు తెలిసింది.

Congress Screening Committee Meeting Today : గెలుపు గుర్రాల ఎంపికపై కాంగ్రెస్ తర్జనభర్జన.. అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం..!

Bandla Ganesh Clarity on Contesting in Assembly Election : కాంగ్రెస్​ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో బండ్ల గణేశ్​.. క్లారిటీ ఇదిగో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.