ETV Bharat / state

telangana mlc election: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్​... నాలుగైదు స్థానాల నుంచి పోటీ..! - తెలంగాణ పొలిటికల్​ వార్తలు

రాష్ట్రంలో నాలుగైదు చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యనాయకులతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి...ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

telangana congress
telangana congress
author img

By

Published : Nov 22, 2021, 9:08 PM IST

Updated : Nov 22, 2021, 10:38 PM IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో (local body mlc election) బరిలోకి దిగాలా వద్దా అనే విషయమై తెలంగాణ కాంగ్రెస్​ పార్టీ (telangana congress) ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్జన భర్జనల అనంతరం నాలుగు చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అందులో ప్రధానంగా ఖమ్మం నుంచి నాగేశ్వరరావు, మెదక్ నుంచి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డిని, నిజామాబాద్ నుంచి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ నుంచి పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌ రెడ్డి కుమారుడు వాసుదేవరెడ్డిని పోటీలో నిలపాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నేడే తేల్చుకోవాలి..

నల్గొండ జిల్లాలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి అక్కడ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో ఇవాళ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. దిల్లీ నుంచి ప్రత్యేక దూత ద్వారా అధిష్ఠానం ఏ ఫారంలు పంపినట్లు సమాచారం. ఈమేరకు ఏడుగురికి బీ ఫారంలు అందజేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ అభ్యర్థులపై కాంగ్రెస్‌ కసరత్తు జరుగుతోంది. అభ్యర్థులు బరిలో నిలిస్తే బీఫారంలు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

ఎన్నో చర్చల అనంతరం

దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటముల ప్రభావం పార్టీపై పడిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీనియర్‌ నాయకులు కొందరు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న జిల్లాలకు చెందిన సీనియర్‌ నాయకులు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలనూ సేకరించారు. నాలుగైదు రోజుల క్రితమే నిర్ణయం ప్రకటించాలని భావించినప్పటికీ.. ఎటూ తేల్చుకోలేక వాయిదా వేశారు. కొన్ని రోజుల క్రితం గాంధీభవన్​లో సీనియర్​ నేతల సమావేశమై ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థలో పార్టీకి ఉన్న బలాబలాలను విశ్లేషించారు.

ఇదీ చూడండి: MLC elections in telangana 2021: ఆరుగురు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం..

Last Updated : Nov 22, 2021, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.