Telangana Civil Supplies Department Information : కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని రాష్ట పౌర సరఫరాల శాఖ తెలిపింది. తెలంగాణకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించేందుకు అసంపూర్తిగా వదిలివేసిన ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ లాంటి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని తెలిపింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంకు 9 సంవత్సరాల్లో రూ.1.59 లక్షలు కోట్లను ప్రభుత్వం వ్యయం చేసిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)ను తక్కువ కాలంలో పూర్తి చేశారని పేర్కొంది.
Civil Supplies Department Release Details : మిషన్ కాకతీయ కింద రూ.5249 కోట్లను ఖర్చు చేసి కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించామన్నారు. ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా.. 2022-23 నాటికి అది 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపింది. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా.. 2022-23కి రికార్డు స్థాయిలో సుమారు 2.70 కోట్ల టన్నులకు చేరుకున్నదని వెల్లడించింది. 2014-15లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉంటే.. 2020-21 నాటికి (44.70 % వృద్ధి) 18.70 లక్షల ఎకరాలు పెరిగి 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నదని పేర్కొంది. 2014-15లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, 2020-21 నాటికి 63.97లక్షల బేళ్లకు చేరుకుందని ప్రకటించింది.
Minister video conference with Collectors : 'రైతులకు ఈ ఏడాది రూ.3160 కోట్లు చెల్లించాం'
Telangana Civil Supplies Department Press Note : పండించిన ధాన్యం మొత్తాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని తెలిపింది. ధాన్యం కాకుండా రూ.11,437.55 కోట్లతో ఇతర పంటలను కొనుగోలు చేసిందని.. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్(Free Electtric)ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నదని తెలిపింది. రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుందని గుర్తు చేసింది. రైతులకు అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించుటకు రైతు రుణ మాఫీని కూడా ప్రభుత్వం అమలుచేస్తున్నదని స్పష్టం చేసింది.
క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం : దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50శాతం తెలంగాణాలోనే ఉత్పత్తి అవుతున్నాయని.. ఇప్పటివరకు రూ. 928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా చేసిందని శాఖ పేర్కొంది. క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పష్టం చేసింది. గోడౌన్ల సామర్థ్యం 2014-15 లో 39.01 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, ప్రస్తుతం 73.82 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని వెల్లడించింది. రైతులకు సూక్ష్మ సేద్యం ద్వారా రూ.2186.14 కోట్ల సబ్సిడీతో 3.10లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చడం జరిగిందని తెలిపింది. పంట పరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1490.15 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీగా చెల్లించిందని తెలిపింది.
ఈసారి 112లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
Gangula Talks With Ration Dealers : ఆ రెండు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: గంగుల
Gangula Kamalakar: 'రెండున్నర రెట్లు అధికంగా ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు'