ETV Bharat / state

'న్యాయవ్యవస్థను ప్రజలు ఓ కంట కనిపెడుతుంటారు' - తెలంగాణ హైకోర్టు చీఫ్​ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్

రాష్ట్రంలో న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జూనియర్ సివిల్ జడ్జిలపై ఉందని హైకోర్టు చీఫ్​ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర జుడిషియల్​ అకాడమీలో 24వ బ్యాచ్​ జూనియర్​ సివిల్​ న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేశారు.

telangana chief justice raghavendra chauhan inaugrated junior civil judge course in hyderabad
'న్యాయవ్యవస్థను ప్రజలు ఓ కంట కనిపెడుతుంటారు'
author img

By

Published : Jan 20, 2020, 1:21 PM IST

న్యాయవ్యవస్థను ప్రజలు నిత్యం ఓ కంట కనిపెడుతూనే ఉంటారని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్​ అన్నారు. న్యాయ వ్యవస్థలోకి అడుగుపెట్టే జూనియర్ సివిల్ జడ్జిలు పారదర్శకంగా ఉండాలని సూచించారు.

తెలంగాణ స్టేట్ జుడిషియల్ అకాడమీలోని 24వ బ్యాచ్​లో చేరిన 51 మంది జూనియర్ సివిల్ జడ్జిలకు జస్టిస్​ చౌహాన్​ దిశానిర్దేశం చేశారు. ఏడాది పాటు అకాడమీలో ఉండే సివిల్ జడ్జిలు అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలని సూచించారు.

అకాడమీ... కేవలం జుడీషియల్ అధికారులను తయారు చేయడమేగాక, మంచి మనుషులుగా మలుస్తుందని జస్టిస్ చౌహాన్ పేర్కొన్నారు.

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.