ETV Bharat / state

నేడు కేబినెట్​ భేటీ - శాసన సభ

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ను నేడు మంత్రివర్గం ఆమోదించనుంది. ఎన్నికల హామీల అమలు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్​ బడ్జెట్​పై సుదీర్ఘ కసరత్తు చేశారు.

కేటాయింపులు
author img

By

Published : Feb 21, 2019, 6:29 AM IST

Updated : Feb 21, 2019, 9:26 AM IST

బడ్జెట్​పై మంత్రి వర్గం సమావేశం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రేపు ఉభయసభల ముందుకు రానుంది. ఓటాన్​ అకౌంట్ బడ్జెట్​కు ఆమోదం కోసం మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. 17 శాతం వృద్ధిరేటుతో ఈ సారి పద్దు 2 లక్షల కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
undefined

సీఎం సుదీర్ఘ కసరత్తు

ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్​ ప్రతిపాదనలు, కేటాయింపులపై విస్తృత స్థాయి కసరత్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల హామీల అమలు దిశగా కేటాయింపులు ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మొదటిసారి కేబినెట్​ సమావేశంలో కేసీఆర్​ నూతన అమాత్యులకు ప్రభుత్వ ప్రాధాన్యాలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై ఇప్పటికే ఆర్డినెన్స్​ను జారీ చేసిన ప్రభుత్వం బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. జీఎస్టీ సవరణల బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
నిధుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు, ఆసరా పింఛన్లకు రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి పారుదల శాఖకు రూ.25 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్​ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి రూ. 24 వేల కోట్లు అవసరమని అంచనాకు వచ్చారు. అయితే రుణమాఫీ ఏ విధంగా చేస్తారో చూడాల్సి ఉంది. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, వేతన సవరణ తదితర అంశాలపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటాన్​​ అకౌంట్​కు నాలుగు లేదా ఆర్నెళ్ల కాలానికి సర్కారు అనుమతి తీసుకునే అవకాశం ఉంది.

undefined

ఇవీ చదవండి:అసెంబ్లీ సమావేశాలకు భద్రత

Intro:Hyd_tg_45_20_Job Cheters Arrest_Ab_C4

Body:Hyd_tg_45_20_Job Cheters Arrest_Ab_C4

Conclusion:Hyd_tg_45_20_Job Cheters Arrest_Ab_C4
Last Updated : Feb 21, 2019, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.