Telangana Cabinet Expansion Today 2023 : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గులాబీ దళపతి ఇటీవల ఒకేసారి 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఎన్నికల నగారా మోగించారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బెర్త్‌లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చోటు దక్కని వారికి మరో రూపంలో అవకాశం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు గులాబీ పార్టీ సిద్ధమైంది.
Patnam Mahender Reddy As Cabinet Minister : నేడు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి(Telangana Health Minister 2023)గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ ఖాళీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
BRS MLA Tickets Telangana 2023 : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట.. ఏడుగురు మహిళలకు ఛాన్స్
Health Ministry to Patnam Mahender Reddy : తాండూర్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ప్రకటించినందున గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కేబినెట్ విస్తరణ చేపడుతున్నారు. ముందుగా బుధవారమే కేబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన (KCR Medak Tour) దృష్ట్యా గురువారం మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు సమాచారం వెళ్లింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిపై.. కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో పైలట్ రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇరువురు నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇదే విషయమై పార్టీ అధిష్ఠానానికి అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే పట్నం మహేందర్‌రెడ్డికి.. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని గులాబీ పార్టీ కట్టబెట్టింది.
అనంతరం కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న ఇరువురు.. ఇటీవలే మరోసారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పైలట్ రోహిత్‌రెడ్డికి (Pilot Rohit Reddy) బీఆర్ఎస్ టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి సేవలు అందిస్తోన్న మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అధిష్ఠానం నిర్ణయించింది.
BRS Party Campaign Strategy 2023 : హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ!
Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'