రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 3.144శాతం డీఏను పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఉద్యోగుల డీఏ 33.536 శాతానికి చేరుకోనుంది. ఆర్టీసీ, డీఏ సహా మొత్తం 49 అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.
ప్లాస్టిక్ నిషేధంపై కమిటీ
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు అధికారుల కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. కమిటీ నివేదిక తర్వాత ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
'పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి'
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించే అంశాన్ని పరిశీలించాలని పోలీసు శాఖను కేబినెట్ సూచించింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు పలు ఇతర నిర్ణయాలను తీసుకుంది.
ఇవీ చూడండి : 'నవంబర్ 5 లోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలి'