ETV Bharat / state

LIVE UPDATES : బడ్జెట్​పై శాసనసభలో ముగిసిన సాధారణ చర్చ.. శాసనమండలి రేపటికి వాయిదా - తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

assembly sessions
assembly sessions
author img

By

Published : Feb 8, 2023, 10:05 AM IST

Updated : Feb 8, 2023, 4:30 PM IST

16:28 February 08

బడ్జెట్ పై శాసనసభలో ముగిసిన సాధారణ చర్చ

  • హైదరాబాద్‌: బడ్జెట్ పై శాసనసభలో ముగిసిన సాధారణ చర్చ
  • రేపు ఉదయం 10 గంటల వరకు సభ వాయిదా
  • శాసనమండలి రేపటికి వాయిదా

15:30 February 08

కాళేశ్వరం రూ.73,235 కోట్లతో పూర్తి చేశాం.. అదే ఇప్పుడు రూ.1.15లక్షల కోట్లు

  • తెలంగాణలో కొత్త సచివాలయం కడితే తప్పు.. దిల్లీలో కొత్త పార్లమెంటు కడితే తప్పు కాదా?
  • బడ్జెట్‌లో షాదీ ముబారక్‌కు రూ.450 కోట్లు కేటాయించాం
  • కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 145 టీఎంసీ నీటిని ఎత్తిపోసి పంటలను కాపాడాం
  • కాళేశ్వరం వేగంగా పూర్తి చేయడం వల్ల.. రూ.73,235 కోట్లతో పూర్తి చేశాం
  • ఇప్పుడు కాళేశ్వరం పూర్తి చేయాలంటే రూ.1.15 లక్షల కోట్లు అయ్యేది
  • ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు చూస్తున్నారు... ఇవన్నీ రాష్ట్రం ఆస్తులు
  • రైతుకు నేరుగా పెట్టుబడి పథకం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

15:25 February 08

ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు: హరీశ్​రావు

  • వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్తోంది: మంత్రి హరీశ్‌రావు
  • రైతుల ఇళ్లకు విద్యుత్‌ బిల్లులు పంపాలని కేంద్రం అంటోంది: హరీశ్‌రావు
  • కేంద్రం చెప్పినట్లు చేస్తే రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల నిధులు వస్తాయి
  • సీఎం కేసీఆర్‌ మాత్రం 65 లక్షల మంది రైతుల గురించే ఆలోచించారు
  • రూ.30 వేల కోట్లు రాకపోయినా సరే అని రైతుల పక్షాన నిలబడ్డారు
  • రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి చెప్పారు: మంత్రి హరీశ్‌రావు
  • గుజరాత్‌లో ఛార్జీలు వసూలు చేస్తూ విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు
  • భాజపాకు తెలిసింది.. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం మాత్రమే: హరీశ్‌రావు
  • ఏ పని ప్రారంభించినా సీఎం కేసీఆర్‌ దేవుడికే మొక్కుకుంటారు: హరీశ్‌రావు
  • కొత్త జిల్లాలకు దేవుడి పేర్లు పెట్టారు: మంత్రి హరీశ్‌రావు
  • బ్యారేజీలకు కూడా దేవుళ్ల పేర్లు పెట్టారు: మంత్రి హరీశ్‌రావు
  • సీఎం కేసీఆర్‌ గోపూజలు చేసినా... తాంత్రిక పూజలు అని దుర్భాషలాడుతున్నారు
  • దేవుడిపట్ల ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నప్పటికీ మేం ఎప్పుడూ మతాల పేరుతో రెచ్చగొట్టలేదు
  • యూనివర్సిటీల్లో తాంత్రిక పూజల కోర్సు అమలు చేసిన ఘనత భాజపా ప్రభుత్వానిది
  • ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు

15:15 February 08

రాష్ట్రంలో 21.50 లక్షల మంది ఆరోగ్య శ్రీ కింద లబ్ధి

  • ఆరోగ్య శ్రీకింద రూ.10 లక్షలు ఇస్తున్నాం
  • రాష్ట్రంలో 21.50 లక్షల మంది ఆరోగ్య శ్రీ కింద లబ్ధి పొందుతున్నారు
  • ప్రతి లక్షకు మాతృ మరణాలను 43కి తగ్గించాం
  • మాతృ మరణాల తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి పెట్టిన లక్ష్యం 70
  • ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో 30.5 శాతం కాన్పులు అయ్యేవి
  • కేసీఆర్‌ కిట్‌ వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు 60 శాతానికి చేరుకున్నాయి
  • వరంగల్‌లో అతిపెద్ద కార్పోరేట్‌ ఆస్పత్రి దసరా నాటికి వస్తుంది
  • మూడు నుంచి 104కు డయాలసిస్‌ కేంద్రాలు పెంచాం.. ఇవి కాంగ్రెస్‌ నాయకులకు కనపడదు... వినపడదు
  • ప్రభుత్వమే ప్రజల దగ్గకు వెళ్లి కంటి పరీక్షలు చేస్తోంది
  • విపక్షాలు కంటి వెలుగు పరీక్షలు చేసుకోవాలి... అప్పుడైనా వారికి అభివృద్ధి కనపడుతుంది

14:07 February 08

ప్రజలకు కావల్సినంత పవర్ ఇచ్చినందుకే ప్రజలు మాకు పవర్‌ ఇచ్చారు: హరీశ్‌రావు

  • ప్రజలకు మేం నిరంతరం పవర్‌ ఇస్తాం, ప్రజలు కూడా ఎప్పటికీ మాకే పవర్‌ ఇస్తారు
  • పవర్‌ హాలీడే ఇచ్చారు కాబట్టే కాంగ్రెస్‌ పవర్‌కు ప్రజలు హాలిడే ఇచ్చారు
  • భారాస ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రైతులు సంబరపడుతున్నారు
  • వాళ్లకు ఎప్పటికీ పవర్‌ రానట్లుందని విపక్షాలకు బాధ కల్గుతోంది: హరీశ్‌రావు

13:50 February 08

ఈటల నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారు: హరీశ్‌రావు

  • బడుగు, బలహీన వర్గాలకు ఏమీ చేయొద్దన్నట్లుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారు
  • గతంలో బడ్జెట్‌ సమావేశాలప్పుడు నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారు
  • విద్యుత్‌ కోతలను నిరసిస్తూ తరచూ నిరసన ప్రదర్శనలు జరిగేవి
  • గతంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటే భయపడాల్సిన పరిస్థితి
  • బిందెడు నీటి కోసం మహిళలు మైళ్ల దూరం నడిచేవారు: మంత్రి హరీశ్‌రావు
  • నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌ నీటి వల్ల ఎముకలు వంకర్లు పోయి బాధపడేవారు
  • ప్రజల గుండెల మీద ఫ్లోరైడ్‌ బండలు తొలగించిందెవరు?

13:36 February 08

మిషన్‌ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనా నిలిపాం: హరీశ్‌రావు

  • ఈటల నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారు: హరీశ్‌రావు

  • మిషన్‌ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనా నిలిపాం: హరీశ్‌రావు
  • తెలంగాణను చూసి కేంద్రం ప్రారంభించిన హర్‌ఘర్‌ జల్‌ పథకం సవ్యంగా సాగటం లేదు

12:52 February 08

ఐదుగురు సభ్యులుంటేనే ఆ పార్టీకి ఆఫీసు ఇచ్చే సంప్రదాయం: హరీశ్‌రావు

  • అసెంబ్లీలో వసతుల గురించి ఈటల, మంత్రుల మధ్య సంవాదం
  • అసెంబ్లీ ప్రాంగణంలో భాజపా సభ్యులకు వసతి కల్పించట్లేదు: ఈటల
  • భాజపా సభ్యులకు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదు: ఈటల
  • ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకూ అవకాశం లేదు: ఈటల
  • ఈటల రాజేందర్‌ మాటలను తప్పుబట్టిన మంత్రి హరీశ్‌రావు
  • ఐదుగురు సభ్యులుంటేనే ఆ పార్టీకి ఆఫీసు ఇచ్చే సంప్రదాయం: హరీశ్‌రావు
  • సౌకర్యాల గురించి ప్రస్తావించే వేదిక ఇది కాదు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • అసెంబ్లీలో బడ్జెట్ గురించి మాత్రమే మాట్లాడాలి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • సౌకర్యాల గురించి స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి మాట్లాడాలి: ప్రశాంత్‌రెడ్డి

12:44 February 08

బీసీల కోసం బడ్జెట్‌లో పెట్టిన మొత్తాన్ని విడుదల చేయటం లేదు: ఈటల

  • రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసింది: ఈటల రాజేందర్‌
  • జీఎస్‌డీపీలో 25 శాతానికి మించి అప్పులు చేయకూడదు: ఈటల
  • తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌డీసీపీలో 38 శాతం అప్పులు చేసింది: ఈటల
  • బీసీల కోసం బడ్జెట్‌లో పెట్టిన నిధులు విడుదల చేయట్లేదు: ఈటల
  • కేంద్రం మద్దతు ధరల కోసం రాష్ట్రంలో రూ.95 వేల కోట్లు ఖర్చు చేసింది: ఈటల
  • మధ్యాహ్న భోజనం కార్మికుల బిల్లులు ప్రతినెలా చెల్లించాలి: ఈటల
  • గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు రుణమాఫీని పూర్తి చేయాలి: ఈటల

12:24 February 08

కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చెంత, ఎత్తి పోసిన నీరెంత?: భట్టి విక్రమార్క

  • కృష్ణా జలాల్లో మన వాటా ఎంతో ఇప్పటివరకు తేల్చలేదు: భట్టి
  • సాగర్ ఎడమ కాలువకు నీరు రాకపోతే.. ఖమ్మం జిల్లాకు తీవ్ర నష్టం: భట్టి
  • కొత్త ప్రాజెక్టులు సాధించకపోతే ఉన్న ప్రాజెక్టులనైనా కాపాడాలి: భట్టి
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చెంత, ఎత్తి పోసిన నీరెంత?: భట్టి విక్రమార్క
  • రుణమాఫీకి తక్కువ నిధులు కేటాయించారు, ఈసారైనా రుణమాఫీ పూర్తి చేయాలి

12:11 February 08

పేదలు ఒక్కసారి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి: భట్టి

  • పేదలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి: భట్టి
  • ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ పేదల కోసం ప్రభుత్వం గృహాలు నిర్మించాలి
  • విద్యార్థుల నెలవారీ మెస్‌ బిల్లులను రూ.3 వేలకు పెంచాలి: భట్టి విక్రమార్క
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందట్లేదు
  • బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు ఎత్తేస్తున్నాయి
  • పేదలు ఒక్కసారి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి: భట్టి
  • ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలను పాటించటం లేదు: భట్టి విక్రమార్క
  • హైస్కూల్ స్థాయి విద్యకే రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు: భట్టి
  • రాష్ట్రంలో రెసిడెన్సియల్‌ పాఠశాలలకు సరైన భవనాలు లేవు: భట్టి
  • ఒకే గదిలో తరగతులు, హాస్టల్‌ను నిర్వహిస్తున్న దుస్థితి ఉంది: భట్టి విక్రమార్క

11:54 February 08

ఇండియా అంటే అదానీ అన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు: భట్టి

  • ఒక పార్టీ భారత్‌లో రెండు దేశాలను సృష్టిస్తోంది: భట్టి విక్రమార్క
  • ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రెండుగా విభజిస్తున్నారు
  • పేదలు పేదలుగానే ఉంటే.. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు: భట్టి
  • ఈ దేశం దోపిడీకి గురవుతోందని జోడోయాత్రలో రాహుల్‌గాంధీతో ప్రజలు అన్నారు
  • అదానీ అనే వ్యాపారి దేశసంపదను లూటీ చేస్తున్నారు: భట్టి విక్రమార్క
  • ఇండియా అంటే అదానీ అన్నట్లుగా భాజపా నేతలు మాట్లాడుతున్నారు
  • అదానీ తప్పులు బయటపెడితే భారత్‌పై దాడి అంటున్నారు: భట్టి
  • ప్రజల కోసం కాంగ్రెస్‌ ప్రధానులు భారీ పరిశ్రమలు నెలకొల్పారు: భట్టి
  • ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ మోదీ సర్కారు అమ్ముతోంది: భట్టి
  • గతంలో విమానాశ్రయాల టెండర్లలో మేలైన నిబంధనలు ఉండేవి: భట్టి
  • అనుభవం లేని వారికి విమానాశ్రయాల టెండర్లు ఇచ్చేవారు కాదు: భట్టి
  • అదానీ కోసం టెండర్ల నిబంధనలను సవరించారు: భట్టి విక్రమార్క
  • భారత్‌ను బలవంతంగా నిలిపేందుకు అంబేడ్కర్‌ అద్భుత రాజ్యాంగం అందించారు

10:32 February 08

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదు: అక్బరుద్దీన్‌

  • బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చ ప్రారంభం
  • చర్చను ప్రారంభించిన ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ
  • విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదు: అక్బరుద్దీన్‌
  • కేంద్ర నిధుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది
  • తెలంగాణకు మూడింట ఒక వంతు నిధులు మాత్రమే వస్తున్నాయి: అక్బరుద్దీన్‌
  • ఏటేటా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ తగ్గుతోంది: అక్బరుద్దీన్‌
  • బడ్జెట్‌ అంచనాల్లో 20 శాతం లోపు మాత్రమే గ్రాంట్ ఇన్‌ ఎయిడ్‌ వస్తోంది

10:02 February 08

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమం

  • హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమం
  • కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మండలి ఛైర్మన్, స్పీకర్
  • కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించిన పలువురు మంత్రులు
  • కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్న శాసన సభాపతి పోచారం
  • కంటివెలుగు దేశంలోనే గొప్ప పథకం: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  • కంటివెలుగు కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు: స్పీకర్‌ పోచారం
  • ఇతర రాష్ట్రాలు కంటివెలుగు ఆదర్శంగా తీసుకుంటున్నాయి: స్పీకర్‌
  • దూర ప్రాంతాలకు వెళ్లలేక కల్లుపోగుట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారు.
  • ప్రజాప్రతినిధులందరూ కంటివేలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి.

09:17 February 08

TG Assembly Sessions Live Updates: రాష్ట్ర బడ్జెట్​పై ఉభయ సభల్లో చర్చ ప్రారంభం

  • రాష్ట్ర బడ్జెట్‌పై ఉభయ సభల్లో సాధారణ చర్చ
  • శాసనసభలో నేడు ప్రశ్నోత్తరాలు రద్దు, నేరుగా బడ్జెట్‌పై చర్చ
  • మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ

Last Updated : Feb 8, 2023, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.