Bandi Sanjay visits Karimnagar : రాష్ట్ర బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని.. అదంతా కేవలం మీడియా సృష్టేనని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కలపడానికి ఒక వర్గం మీడియా కుట్ర పన్నుతోందన్నారు. కరీంనగర్‌లోని పలు వార్డుల్లో ఎంపీలాడ్స్‌తో చేపట్టనున్న పనులకు ఆయన భూమి పూజ చేశారు.
ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ ఉందన్న ఆయన.. పార్టీ పెద్దల సూచనల ప్రకారం ఎవరి బాధ్యతను వారు నిర్వర్తిస్తామన్నారు. కర్ణాటకలో తమ ఓటింగ్ శాతంలో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఉనికిని చాటుకోవడానికి 150కోట్ల రూపాయలతో సంబరాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒకవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా రామడుగులో పర్యటించిన కేసీఆర్.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల పరిహారం ఇస్తానని చెప్పి ఇంతవరకు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమకాలేదని దుయ్యబట్టారు.
ఇంటెలిజెన్స్ వర్గాలతో తనపై కేసీఆర్ నిఘా ఉంచారన్న ఆయన.. తనకు, మంత్రి గంగుల కమలాకర్‌కు మధ్య రహస్య ఒప్పందం ఉందన్న ఆరోపణలను త్రోసి పుచ్చారు. గ్రానైట్స్ వ్యాపారుల నుంచి ఎలాంటి ముడుపులు రాలేదని.. ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తాను ఈడీ అధికారిని కాదన్న బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు.
"రాష్ట్ర బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవు. మీడియాలో బీజేపీని తగ్గించి చూపే ప్రయత్వం చేస్తున్నారు. కర్ణాటకలో ఓటింగ్ శాతంలో ఎలాంటి మార్పు రాలేదు. పార్టీ పెద్దలు ఈటల రాజేందర్‌కు చేరికల బాధ్యతను అప్పగించారు. పార్టీ అధినాయకుల సూచన ప్రకారం ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తాము. గ్రానైట్స్ వ్యాపారుల నుంచి ముడుపులు అందాయన్న ఆరోపణలు అవాస్తవం. ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపాలి. కేసీఆర్ తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నారు". - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి:
- Etela Rajender Respond TS BJP President Post : 'బండి సంజయ్ మార్పు.. ఉండకపోవచ్చు'
- MLA Raghunandan Rao reacts on ORR lease issue : "సీబీఐకి ఫిర్యాదుచేశాం.. లీజుపై కేసీఆర్ స్పందించాలి"
- Jeevan Reddy Fires on BRS Govt : 'రైస్‌మిల్లర్ల చెప్పుచేతుల్లో ధాన్యం సేకరణ'
- KISHAN REDDY ON TERRORISM : ఉగ్రవాదాన్ని కేంద్రం ఉక్కుపాదంతో అణచివేస్తుంది: కిషన్ రెడ్డి