ETV Bharat / state

Telangana BJP MLA Candidates First List : 55 మందితో తొలి జాబితాకు అధిష్ఠానం ఆమోద ముద్ర.. అధికారిక వెల్లడికి మరికొంత సమయం! - తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టో 2023

Telangana BJP MLA Candidates First List 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో దిగే 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాకు.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కానీ అధికారికంగా వెల్లడించేందుకు మరికొంత సమయం పట్టనున్నట్లు పార్టీ వర్గలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరారైన అభ్యర్థులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి నేరుగా ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. ఫోన్​లో మాట్లాడి అభినందనలు తెలియజేస్తూ గెలుపే లక్ష్యంగా పూర్తిస్థాయిలో పనిచేయాలని కోరారు.

Telangana BJP MLA Candidates First List 2023
Telangana BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 9:52 AM IST

Telangana BJP MLA Candidates First List 2023 : శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా(BJP Candidates First List)పై బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee) శుక్రవారం రాత్రి 55 మందితో తొలి జాబితాకు ఆమోద ముద్ర వేసింది. కానీ అధికారికంగా వెల్లడించేందుకు మరికొంత సమయం పట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులుగా ఖరారైన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy).. నేరుగా ఫోన్‌ చేసి చెబుతున్నారు. శనివారం సుమారు 25 మందికి పైగా అభ్యర్థులకు కిషన్‌రెడ్డి, బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జీ ప్రకాశ్‌ జావడేకర్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌.. ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలియజేస్తూ గెలుపే లక్ష్యంగా పూర్తిస్థాయిలో పని చేయాలని కోరారు. ఇవాళ మిగిలిన అభ్యర్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. అధిష్ఠానం నుంచి ఫోన్లు రావడంతో అభ్యర్థులు.. స్థానిక నేతలు, ఇతరులతో భేటీ అవుతూ ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

BJP Leaders Meeting on Telangana Elections : దిల్లీలో బీజేపీ నేతల సమావేశం.. తెలంగాణ ఎన్నికలపై చర్చ

Telangana BJP Election campaign strategy : ఎన్నికల ప్రచార వ్యూహంపై ముఖ్య నేతలు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ సమావేశానికి ప్రకాశ్‌ జావడేకర్‌, తరుణ్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర ముఖ్యనేతలు హాజరయ్యారు. అభ్యర్థిత్వం ఖరారైన చోట వెంటనే ప్రచారం ప్రారంభించాలని.. టికెట్లు రాని నేతలను సముదాయించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 చోట్ల నిర్వహించే బహిరంగ సభలు, జాతీయ నేతల సభల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే 11 సభలు పూర్తి కాగా.. మిగిలిన 19 సభల నిర్వహణపై సమీక్షించారు.

BJP Manifesto in Telangana 2023 : మరోవైపు ప్రజల్ని ఆకర్షించేలా ఎన్నికల ప్రణాళికను బీజేపీ సిద్ధం చేస్తోంది. అన్ని వర్గాలకు చెందిన అంశాలు పొందుపరిచేలా.. మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. మేనిఫెస్టోలో కర్షకులు, ఉచిత విద్య, ఉచిత వైద్యం.. మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌(Telangana Congress) ప్రకటించిన ప్రణాళికకు దీటుగా.. కమలం పార్టీ ప్రకటించే మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana BJP MLA Candidates First List 2023 : 55 మంది అభ్యర్థులతో నేడే బీజేపీ తొలి జాబితా.. గజ్వేల్​లో కేసీఆర్​పై​ ఈటల పోటీ!

Telangana BJP MLA Candidates First List Delay : బీజేపీ తొలి విడత అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.