ETV Bharat / state

BJP national executive meet: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నేతలు - దిల్లీలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం

దిల్లీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశానికి తెలంగాణ నేతలు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి వర్చువల్​గా బండి సంజయ్​, ఈటల రాజేందర్​ సహా కీలక నేతలు పాల్గొన్నారు.

bjp national executive meeting
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం
author img

By

Published : Nov 7, 2021, 12:57 PM IST

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ నేతలు పాల్గొన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయ శాంతి, వివేక్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు వర్చువల్​గా జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు.

సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో దేశ రాజకీయాలతో పాటు త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నారు.

కీలక అంశాలపై చర్చ

బంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ భేటీలో విశ్లేషించనున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నారు. అన్ని రకాల ముఖ్యమైన అంశాలను ఈ భేటీలో(Bjp National Executive Meet) చర్చిస్తామని భాజపా నేత ఒకరు తెలిపారు. కొవిడ్ కట్టడిలో కేంద్రం పని తీరును, టీకా పంపిణీ ప్రక్రియను ప్రశంసలు తెలిపే అవకాశం ఉంది.

గత నెల జీఎస్​టీ వసూళ్లలో అనూహ్య వృద్ధి సాధించిన అంశాన్ని కూడా ఈ సమావేశంలో (Bjp National Executive Meet) చర్చించనున్నారు. ఇటీవల జరిగిన 3 లోక్​సభ, 29 అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కరోనా వ్యాప్తి తర్వాత భాజపా కార్యవర్గ భేటీ జరగటం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం- కీలక నేతలు హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.