ETV Bharat / state

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - సభ్యుల అభినందనలు

Telangana Assembly Speaker Gaddam Prasad Kumar 2023 : రాష్ట్ర మూడో అసెంబ్లీకి సభాపతిగా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సహా మంత్రులు, ఇతర సభ్యులు స్పీకర్​కు అభినందనలు తెలిపారు. స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన అన్నిపార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.

Telangana Assembly Speaker Election 2023
Gaddam Prasad Kumar Elected as Speaker of Telangana Assembly
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 1:34 PM IST

Updated : Dec 14, 2023, 3:29 PM IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - సభ్యుల అభినందనలు

Telangana Assembly Speaker Gaddam Prasad Kumar 2023 : రాష్ట్ర మూడో అసెంబ్లీకి స్పీకర్​గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌(prasad kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి ఒక్కటే నామినేషన్‌ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సహా మంత్రులు కలిసి ప్రసాద్‌కుమార్‌ని సభాపతి స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Assembly Sessions 2023 : ముఖ్యమంత్రి, శాసనసభ నాయకుడి హోదాలో తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మంచి సంప్రదాయానికి సభ తొలిరోజే నాంది పలికిందన్న రేవంత్‌ రెడ్డి భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాక్షించారు. వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరని, అక్కడి నుంచి వచ్చిన ప్రసాద్ కుమార్ సమాజంలో ఎన్నో రుగ్మతలకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. వికారాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని ముఖ్యమంత్రి(Revanth Reddy) కొనియాడారు.

తెలంగాణ స్పీకర్​గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవం - నేడు అధికారిక ప్రకటన

Deputy CM Bhatti Vikramarka : స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అభినందనలు తెలిపారు. గడ్డం ప్రసాద్‌ మంత్రిగా ఉన్నప్పుడు చేనేతల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. అప్పట్లో గడ్డం ప్రసాద్‌తో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం దిశగా స్పీకర్ సలహాలు ఇవ్వాలని కోరారు. స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన విపక్షాలకు ధన్యవాదాలు చెప్పారు.

తెలంగాణ స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్

పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్‌ రాష్ట్రంలోని సమస్యలను పెద్దఎత్తున చర్చించేందుకు సభ్యులకు అధిక సమయం ఇస్తారని ఆశిస్తున్నామని శాసననసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభలో చర్చలు అర్థవంతంగా నడుపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి సీతక్క(Minister seethakka) స్పీకర్​గా ఎన్నికైన గడ్డం ప్రసాద్​కు అభినందనలు తెలిపారు. ఆయన జీవితం అణగారిన వర్గాలకు ఆదర్శమని కొనియాడారు.

ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌ శాసనసభకు తండ్రిలాంటివారని కొనియాడారు. స్పీకర్‌ పదవికే గడ్డం ప్రసాద్‌ వన్నె తెస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. స్పీకర్​గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్‌కు కూనంనేని సాంబశివరావు అభినందనలు తెలిపారు. శాసనసభ దేవాలయం లాంటిదని ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ పనిచేయాలని తెలిపారు.

EX Minister KTR : కేసీఆర్ ఆదేశాలతో సభాపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు బీఆర్ఎస్ సహకరించిందని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సభలోని ప్రతి ఒక్కరి హక్కుల పరిక్షణకు స్పీకర్ కృషి చేయాలని కోరారు. ఎంపీటీసీ నుంచి స్పీకర్‌గా ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు.

పార్లమెంటు మాదిరి అసెంబ్లీ భవనాలు - నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

నేను భూకబ్జా చేయలేదు - నాకు అంత అవసరం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి

Last Updated : Dec 14, 2023, 3:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.