Telangana Assembly: శాసనసభలో ఇవాళ బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై చర్చ చేపడతారు. అనంతరం ఆర్ధికమంత్రి హరీష్ రావు చర్చకు సమాధానం చెప్తారు. పూర్తి స్థాయిలో చర్చ చేపట్టేందుకు వీలుగా ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా సభ సమావేశం కాగానే చర్చ చేపడతారు. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రకటన చేయనున్నారు.
సోమవారం సభాపతి అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం నిర్ణయాలను సీఎం కేసీఆర్ సభ ముందు ఉంచుతారు. స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్, సింగరేణి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, బేవరేజెస్ కార్పొరేషన్ నివేదికలను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెడతారు.
ఇదీ చదవండి: