ETV Bharat / state

మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఛాలెంజ్​ - విద్యుత్​కు సంబంధించి ఆ 3 అంశాలపై న్యాయ విచారణకు సీఎం ఆదేశం - మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఛాలెంజ్

Telangana Assembly Sessions 2023 Live News Today : విద్యుత్​కు సంబంధించిన మూడు అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్​గఢ్​తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. విచారణ జరపాలన్న విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సవాల్​ను స్వీకరిస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ ఇచ్చారో తెలుసుకునేందుకు ముందుకు వస్తే, అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

CM Revanth Reddy Accepted Jagadeesh Reddy Challenge
CM Revanth Reddy ordered to investigate on Yadadri Project
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 1:13 PM IST

Updated : Dec 21, 2023, 2:30 PM IST

మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఛాలెంజ్​ - ఆ మూడు ప్రాజెక్టులపై న్యాయ విచారణకు సీఎం రేవంత్​ ఆదేశం

Telangana Assembly Sessions 2023 Live News Today : విద్యుత్​కు సంబంధించిన మూడు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్​గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపారు. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా విచారణ జరపాలన్న మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం, ఆ సవాల్​ను స్వాగతిస్తున్నామన్నారు.

తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,516 కోట్లు : భట్టి విక్రమార్క

Judicial Inquiry On Telangana Power Sector Financial Situation : తమ ఆర్థిక తప్పిదాలను కప్పిపుచ్చుకునేలా ఎదురు దాడి చేస్తున్నామని బీఆర్​ఎస్​ నేతలు అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే వాస్తవాలను సభ ముందు ఉంచి చర్చించేందుకు తొమ్మిదిన్నరేళ్లలో గత ప్రభుత్వం ముందుకు రాలేదని రేవంత్ పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని పూర్తిస్థాయిలో స్కాన్ చేసి సభ ముందుంచామని తెలిపారు. గత ప్రభుత్వం తప్పులను అవగాహన రాహిత్యంతో చేసిందా లేక ఉద్దేశపూర్వకమా అనేది విచారణలో తేలుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

అత్యవసరమంటూ టెండర్లు లేకుండానే ఛత్తీస్​గఢ్​తో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దానిపై అసెంబ్లీలో తాము గతంలోనే చెప్పే ప్రయత్నం చేస్తే, మార్షల్స్​తో బయటకు పంపించారని గుర్తు చేశారు. ఓ అధికారి వాస్తవాలు చెబితే హోదా తగ్గించి మారుమూల ప్రాంతానికి పంపించారన్నారు. ఛత్తీస్​గఢ్​లో 2014 నవంబరు 3న జరిగిన 1000 మెగా వాట్ల ఒప్పందం వల్ల ప్రజలపై రూ.1,326 కోట్ల భారం పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై కూడా విచారణ జరిపిస్తామన్నారు.

'మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను నేను స్వీకరిస్తున్నాను. ఆయన కోరుకున్నట్టే న్యాయ విచారణ చేయిస్తాం. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టుపైనా న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. యాదాద్రి ప్రాజెక్టు 8 ఏళ్లయినా పూర్తి కాలేదు. యాదాద్రి ప్రాజెక్టుపైనా న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. - రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం - శాసనసభా వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం

సబ్ క్రిటికల్​తో కాకుండా సూపర్ క్రిటికల్ విధానంతో చేపట్టాలంటూ కేంద్రం 2013లోనే విధి విధానాలు మార్చినప్పటికీ, గత ప్రభుత్వం ఇండియా బుల్స్ కంపెనీకి మేలు జరిగేలా ఒప్పందం చేసుకుందన్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుకు ఏడేళ్లు పట్టిందన్నారు. కేటీపీఎస్ ఏడో దశ మెగా వాట్​కు రూ.8 కోట్లతో పూర్తి కాగా, భద్రాద్రి ప్రాజెక్టుకు మాత్రం మెగా వాట్​కు రూ.9 కోట్ల 74 లక్షల ఖర్చయిందన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవకుండా బీహెచ్ఈఎల్​తో 2015 జూన్ 1న ఒప్పందం జరిగిందని, దాని వెనక ఏం జరిగిందో కూడా విచారణలో తేలుతుందని సీఎం అన్నారు.

సోలార్ విద్యుత్ 2014లో 74 మెగా వాట్లు ఉండగా, ఇప్పుడు 5 వేల 600 మెగా వాట్లకు చేరిందన్న రేవంత్ రెడ్డి, అందులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది కేవలం ఒక మెగా వాట్ మాత్రమేనన్నారు. మిగతాదంతా ప్రైవేట్ వాళ్లు, కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ ఇచ్చారో నిజ నిర్ధారణ కోసం అఖిలపక్ష కమిటీ వేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సబ్ స్టేషన్ల వారీగా లాగ్ బుక్కులు తీసి వాస్తవాలను తేలుద్దామన్నారు.

‘గృహలక్ష్మి’ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం - ఆశావహుల ఎదురుచూపులు

Last Updated : Dec 21, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.