ETV Bharat / state

Telangana Assembly Elections Schedule 2023 : అక్టోబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ - EC Team Visits in Telangana

Telangana Assembly Elections Schedule 2023 : శాసనసభ ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత కసరత్తు చేస్తోంది. అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించాలని చూస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపించిన వేళ.. ఈసీ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత ఎన్నికల అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మరింత సమర్థంగా, లోపరహితంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోనుంది.

Telangana Assembly Elections
CEC on Telangana Assembly Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 11:24 AM IST

Telangana Assembly Elections Schedule 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) సమాయత్తం అవుతోంది. శాసనసభ ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు విస్తృత కసరత్తు చేస్తోంది. ఇందుకుగానూ అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించాలని యోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌(CEO Rajeev Kumar) ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణకి రానుంది. అక్టోబరు మొదటి వారంలో వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.

  • ఇంతకుముందు గడువుకు ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేయటంతో.. 2018 అక్టోబరు 6వ తేదీన షెడ్యూల్‌ వచ్చింది. డిసెంబరు 7న ఎన్నికల పోలింగ్ జరిగింది.
  • జనవరి 17వ తేదీన అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. ఆ మేరకు చూస్తే.. రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది.
  • రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే గడువు. ఒక్క మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ సంవత్సరం డిసెంబరు 17తో ముగియనుంది.
  • తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు కూడా ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

Telangana Assembly Elections Polling Date 2023 : ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రభుత్వ సెలవులతో పాటు.. స్థానిక పండగల సెలవులు ఏమైనా ఉన్నాయా అని కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. సాధారణంగా రానున్న అక్టోబరు, నవంబరు నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండగలు ఉన్నాయి. ఇవికాకుండా వేరే సెలవులు లేవని అధికారులు గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ పూర్తి స్థాయి బృందం రెండు దఫాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించనుంది.

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

EC on TS Assembly Elections : షెడ్యూల్‌ ప్రకటించటానికి ముందు సన్నద్ధతను అధ్యయనం చేసేందుకు, మరో దఫా నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత ఈ పర్యటనలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం తొలి పర్యటనకే పరిమితం అవుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం రాష్ట్రమంతా పర్యటించి ఎన్నికల సన్నద్ధత తొలిదశను పరిశీలించింది. మరోపక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ తెలంగాణలో ముమ్మరంగా సాగుతోంది. కాగా.. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. అయితే నవంబరు 4వ తేదీన తుది ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు.

ఎన్నికల్లో డబ్బు కట్టడిపై పకడ్బందీ చర్యలు : ఈ దఫా కూడా డిసెంబరులోనే పోలింగు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. డిసెంబరు రెండో వారంలోగా పోలింగును ముగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల పరిశీలకులను నియమించేందుకు అధికారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కీలకమైన నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండనున్న దృష్ట్యా ఎన్నికల సంఘం.. దానిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది.

EC Team Visits in Telangana : రాష్ట్రంలోని హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నిఘాను మరింత విస్తృతం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఇందుకుగానూ దేశంలో ఉన్న 20కి పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను(Enforcement Agencies) రంగంలోకి దింపనుంది. డబ్బు వినియోగాన్ని కట్డడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయా సంస్థలు రూపొందించే ప్రణాళికలను పరిశీలిస్తుంది. ఈ మేరకు అక్టోబరులో రాష్ట్ర పర్యటన సందర్భంగా సమీక్షిస్తుంది. సందేశాన్ని సైతం ఆయా సంస్థలకు పంపింది.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఈసీ కసరత్తు

Telangana Assembly Elections 2023 : హైదరాబాద్​కు ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.