ETV Bharat / state

తుది దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారాలు - హాట్ ​హాట్​గా ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రసంగాలు - తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారాలు

Telangana Assembly Elections Campaigns 2023 : ఎన్నికల ప్రచారానికి మరో మూడ్రోజులే గడువు ఉండటంతో.. ప్రధాన పార్టీల రాజకీయ నేతలంతా ప్రచారంలో దూకుడు పెంచారు. గెలుపై లక్ష్యంగా అభ్యర్థులు పల్లె, పట్నాలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్​ఎస్.. అధికార బీఆర్​ఎస్​ను గద్దె దించి అధికారం ఛేజిక్కుంచుకోవాలనే వ్యూహంతో ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

Elections Campaigns 2023
Telangana Assembly Elections Campaigns 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 10:02 PM IST

తుది దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారాలు - హాట్ ​హాట్​గా ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రసంగాలు

Telangana Assembly Elections Campaigns 2023 : హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్.. ప్రగతినగర్ నుంచి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్.. సనత్​నగర్ బీఆర్​ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదేవిధంగా సనత్‌నగర్‌లో ప్రచారం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి నీలిమ ఎన్నికల్లో గెలుపు ఖాయామని ధీమా వ్యక్తం చేశారు. గల్లీ.. గల్లీ తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి రంజిత్ కుమార్.. తమ ఇటుక గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు. ఖైరతాబాద్ బీఆర్​ఎస్(BRS) అభ్యర్థి దానం నాగేందర్ సోమాజిగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్​కుమార్ యాదవ్ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

ఆచితూచి అడుగేస్తున్న విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి

Telangana Assembly Elections 2023 : భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్‌ రె‌డ్డి.. వాకర్స్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్య గడప గడపకు తిరిగి ఓటు అభ్యర్థించారు. నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని కొండాపురం, నేర్మట, ధోనిపాముల గ్రామాల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. అదేవిధంగా బీఆర్​ఎస్ అభ్యర్థి మిర్యాలగూడలోని షాపింగ్‌ మాల్స్‌లో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జైవీర్‌కు మద్దతుగా జానారెడ్డి ప్రచారం చేయగా.. మహిళలు ఆటపాటలతో స్వాగతం పలికారు. బీఆర్​ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతా గెలుపు కోసం వారి కుమార్తె హర్షితారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ(bjp) అభ్యర్థి శ్రీదేవి ప్రచారం చేశారు. బీఆర్​ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చెన్నూరులోని ఇందారం-1 గనిలో సింగరేణి కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించారు.

తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలు - గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు

హనుమకొండ జిల్లా పరకాలలోని పలు కాలనీల్లో బీజేపీ అభ్యర్థి పగడాల కాళీ ప్రసాదరావు గడప గడపకు తిరిగి ఓటు అభ్యర్థించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కాంగ్రెస్(Congress) అభ్యర్థి సీతక్క విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి సీతక్క నృత్యం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట బీఆర్​ఎస్​ అభ్యర్థి ఆరూరి రమేశ్​ ప్రచార జోరు పెంచారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మేనిఫెస్టో వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. జగిత్యాల అర్బన్‌, ధరూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆరు గ్యారంటీలను వివరిస్తూ.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలను మూసివేస్తున్న కేంద్రం.. చక్కర కర్మాగారాలను తెరిపిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లలో కవిత పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి మాత్రమే నిరుద్యోగం - రాజకీయ ఉద్యోగం కోసమే ఆ పార్టీ ఆరాటం : మంత్రి కేటీఆర్

నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో బాల్కొండ బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మకు మద్దతుగా ఎంపీ అర్వింద్ ప్రచారంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీఆర్​ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్.. గాంధారి మండలం, రామ్ లక్ష్మణ్​పల్లి, సంగెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి పలు గ్రామాలకు వెళ్లగా.. మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ అభ్యర్థి ఉపేందర్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా.. ఆయన కుమారుడు పృథ్వి కృష్ణారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు . సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.