Telangana Leaders Vote Right Constituencies : తెలంగాణలో ఎన్నికల(TS Elections) ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వారంతా ఎన్నికల సమరానికి సై అంటున్నా.. తమ ఓటు తమకు వేసుకోలేరు. ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించినా.. తాము స్వయంగా బరిలో నిలిచిన చోట ఈవీఎంలో తమ గుర్తుపై మీట నొక్కలేరు.
Telangana Assembly Elections 2023 : సీఎం కేసీఆర్(CM KCR) సహా ఆరుగురు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ అర్వింద్‌లాంటి వారితోపాటు.. ప్రధాన పార్టీలకు చెందిన దాదాపు 59 మందికిపైగా అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సొంతూరు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటుంది. ప్రస్తుతం ఆయన గజ్వేల్, కామారెడ్డిల్లో పోటీ చేస్తుండగా.. ఈ రెండుచోట్లా ఓటు వేసుకోలేరు. ఈటలకు హుజూరాబాద్‌లో ఓటు ఉండగా.. గజ్వేల్‌లో ఓటు వేసుకోలేరు.
మంత్రి కేటీఆర్ సిరిసిల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. ఖైరతాబాద్‌లో ఓటుహక్కు ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తుండగా.. సికింద్రాాబాద్లో ఓటుహక్కు ఉంది. ఇంకా టి.పద్మారావుగౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులకు వారు పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటు లేదు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కొడంగల్‌లో ఓటుంది. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రముఖుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కోదాడలో ఓటు హక్కు ఉంది.. హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నకిరేకల్‌లో ఓటుండగా.. మునుగోడు నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు నుంచి పోటీ చేస్తుండగా.. సత్తుపల్లిలో ఓటు ఉంది. ఇంకా మధుయాస్కీగౌడ్, వివేక్ సోదరులు, కొండా సురేఖ తదితరులకు కూడా పోటీ చేస్తున్న చోట ఓటు లేదు.
ఓరుగల్లు పోరులో విజయం ఎవరిది- అనుభవానిదా, యువతరానిదా?
అభ్యర్థి | పోటీ చేస్తున్న నియోజకవర్గం | పార్టీ | ఓటున్న నియోజకవర్గం |
కేసీఆర్ | గజ్వేల్, కామారెడ్డి | బీఆర్ఎస్ | సిద్దిపేట |
రేవంత్ రెడ్డి | కామారెడ్డి | కాంగ్రెస్ | కొడంగల్ |
ఈటల రాజేందర్ | గజ్వేల్ | బీజేపీ | హుజూరాబాద్ |
కేటీఆర్ | సిరిసిల్ల | బీఆర్ఎస్ | ఖైరతాబాద్ |
ధర్మపురి అర్వింద్ | కోరుట్ల | బీజేపీ | నిజామాబాద్ |
ఎర్రబెల్లి దయాకర్‌రావు | పాలకుర్తి | బీఆర్ఎస్ | వర్ధన్నపేట |
సీహెచ్ మల్లారెడ్డి | మేడ్చల్ | బీఆర్ఎస్ | సికింద్రాబాద్ |
సబితా ఇంద్రారెడ్డి | మహేశ్వరం | బీఆర్ఎస్ | చేవెళ్ల |
తలసాని శ్రీనివాస్‌యాదవ్ | సనత్‌నగర్ | బీఆర్ఎస్ | సికింద్రాబాద్ కంటోన్మెంట్ |
పద్మారావు గౌడ్ | సికింద్రాబాద్ | బీఆర్ఎస్ | సనత్‌నగర్ |
మర్రి రాజశేఖర్ రెడ్డి | మల్కాజిగిరి | బీఆర్ఎస్ | సికింద్రాబాద్ కంటోన్మెంట్ |
పల్లా రాజేశ్వర్‌రెడ్డి | జనగామ | బీఆర్ఎస్ | ఖైరతాబాద్ |
కడియం శ్రీహరి | స్టేషన్ ఘన్పూర్ | బీఆర్ఎస్ | వరంగల్ పశ్చిమ |
అభ్యర్థి | పోటీ చేస్తున్న నియోజకవర్గం | పార్టీ | ఓటున్న నియోజకవర్గం |
ఉత్తమ్‌కుమార్ రెడ్డి | హుజూర్నగర్ | కాంగ్రెస్ | కోదాడ |
కొండా సురేఖ | వరంగల్ తూర్పు | కాంగ్రెస్ | పరకాల |
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | మునుగోడు | కాంగ్రెస్ | నకిరేకల్ |
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | పాలేరు | కాంగ్రెస్ | సత్తుపల్లి |
గడ్డం వినోద్ | బెల్లంపల్లి | కాంగ్రెస్ | ఖైరతాబాద్ |
గడ్డం వివేక్ | చెన్నూరు | కాంగ్రెస్ | మంచిర్యాల |
అజారుద్దీన్ | జూబ్లీహిల్స్ | కాంగ్రెస్ | ఖైరతాబాద్ |
మధుయాష్కీ గౌడ్ | ఎల్బీనగర్ | కాంగ్రెస్ | నిజామాబాద్ |
రాణి రుద్రమరెడ్డి | సిరిసిల్ల | బీజేపీ | ఇబ్రహీంపట్నం |
అక్బరుద్దీన్ ఓవైసీ | చాంద్రాయణగుట్ట | ఎంఐఎం | ఖైరతాబాద్ |